ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ 3 డిఫరెంట్ లుక్స్ తో..?

ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ లుక్ గురించి ఒక క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ 70 శాతానికి పైగా పూర్తయిన నేపథ్యంలో కొమరం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ లుక్ గురించి చిత్ర యూనిట్ ఒక అవగాహనకు వచ్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ మూడు విభిన్న లుక్స్ లో కనిపిస్తారట. సినిమా ప్రారంభంలో ఎన్టీఆర్ లుక్ ఒకలా ఉంటే, విరామం తరువాత మరో రెండు విభిన్న గెటప్స్ లో కనిపిస్తారట. ప్రతి లుక్ విభిన్నంగా, ప్రత్యేకంగా ఉండేలా రాజమౌళి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మూడు గెటప్స్ లో ఎన్టీఆర్ చాలా వైవిధ్యంగా కనిపిస్తారని తెలుస్తుంది.

RRR Movie New Still

ఎన్టీఆర్ లుక్స్ ఫ్యాన్స్ కి బడా ట్రీట్ లా ఉంటాయని తెలుస్తుంది. ఈ విషయం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నిజంగా గూస్ బమ్స్ కలిగించడం ఖాయం. ఇప్పటికే లీకైన కొన్ని ఫొటోలలో ఎన్టీఆర్ ఆసక్తి రేపుతున్నాడు. పులితో పోరాటం చేస్తూ, బేర్ బాడీతో ఉన్న ఎన్టీఆర్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు, సినిమాపై హైప్ పెంచేస్తుంది. డివివి దానయ్య 350 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక మరో హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు. రామ్ చరణ్ కి జంటగా అలియా భట్ నటిస్తుంది. ఎన్టీఆర్ కొరకు బ్రిటన్ స్టేజ్ ఆర్టిస్ట్ ఒలీవియా మోరిస్ ని తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జులై 30న ఆర్ ఆర్ ఆర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ విడుదల ఆలస్యం అయ్యే అవకాశం కలదు.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus