స్టార్ యాంకర్ ప్రదీప్.. హీరోగా మారుతూ చేసిన చిత్రం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు మున్నా దూలిపుడి డైరెక్ట్ చేసాడు. ‘ఎస్వీ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎస్వీ.బాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు.అనూప్ రూబెన్స్ సంగీతంలో రూపొందిన ‘నీలి నీలి ఆకాశం’ అనే ఒక్క పాట.. ఈ చిత్రానికి బోలెడంత క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఇక ‘జి.ఏ2.పిక్చర్స్’ ‘యూ.వీ. క్రియేషన్స్’ వంటి బడా నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చెయ్యడానికి ముందుకు రావడంతో ఆ అంచనాలు డబుల్ అయ్యాయనే చెప్పొచ్చు. దాంతో జనవరి 29న విడుదలైన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. మంచి కలెక్షన్లు నమోదయ్యాయి. దాంతో 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసింది. వీక్ డేస్ లో కూడా పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైన జాంబీ రెడ్డి దెబ్బకు డౌన్ అయ్యిందనే చెప్పాలి.
ఈ చిత్రం 10 రోజుల కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :
నైజాం
2.07 cr
సీడెడ్
1.28 cr
ఉత్తరాంధ్ర
0.83 cr
ఈస్ట్
0.50 cr
వెస్ట్
0.40 cr
కృష్ణా
0.48 cr
గుంటూరు
0.55 cr
నెల్లూరు
0.30 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
6.41 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.21 cr
ఓవర్సీస్
0.24 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
6.86 cr
’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రానికి 4.5 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉండగా …ఆ టార్గెట్ ను 4 రోజుల్లోనే కంప్లీట్ చేసింది.ఇక 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 6.86 కోట్ల షేర్ ను రాబట్టింది.అయితే ‘జాంబీ రెడ్డి’ వంటి క్రేజీ చిత్రం జోరందుకోవడంతో సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిందని చెప్పాలి. నిన్న అంటే ఆదివారం రోజున ఈ చిత్రం 0.17 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.