Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ .. చరణ్ కి పెద్ద రిలీఫ్ దక్కే రోజు వచ్చేస్తుంది..!
- June 17, 2024 / 08:54 PM ISTByFilmy Focus
మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan ) హీరోగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా సెట్స్ పైకి వెళ్లి 3 ఏళ్ళు కావస్తోంది. అయినా ఇంకా సినిమా రిలీజ్ కాలేదు. దానికి కారణం దర్శకుడు మధ్యలో ‘ఇండియన్ 2’ (Indian2) ప్రాజెక్టు చేయాల్సి రావడం ఒకటైతే..ఇంకోటి ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్లో భాగంగా తీసిన ఫుటేజ్ విషయంలో అతను కాంప్రమైజ్ కాకుండా రీ షూట్లు చేస్తుండటం. ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’ కి సంబంధించి రూ.60 కోట్ల ఫుటేజీ శంకర్ (Shankar) డస్ట్ బిన్లో పడినట్టు టాక్.
మరోపక్క హీరో రాంచరణ్ డేట్స్ కూడా పెంచుకుంటూ వచ్చాడు. ఈ ప్రాజెక్టులో పడి.. అతను ఇంకో సినిమా చేసుకోలేకపోయాడు. అయితే మొత్తానికి చరణ్ కి పెద్ద రిలీఫ్ దక్కే రోజు వచ్చేసింది. అవును ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ఇంకో వారంలో లేదా మరీ పొడిగిస్తే అదనంగా 3 రోజులు.. అంటే 10 రోజుల్లో ఫినిష్ అయిపోతుందట. సో చరణ్ ఫ్రీ అయిపోతాడు. ఒక వారం ఫ్యామిలీతో విదేశాలకి టూర్ కి వెళ్లొచ్చి..

వెంటనే బుచ్చిబాబు (Buchi Babu Sana) సినిమా షూటింగ్లో జాయిన్ అవుతాడు. మరోపక్క 2 వారాల్లో ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. మొత్తంగా చరణ్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ‘గేమ్ ఛేంజర్’ లో హీరోయిన్ గా కైరా అద్వానీ (Kiara Advani) నటిస్తుండగా.. శ్రీకాంత్ (Srikanth), ఎస్.జె.సూర్య (SJ Suryah), అంజలి (Anjali), జయరాం (Jayaram) వంటి స్టార్లు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

















