Jr NTR: ఎవరైనా తప్పు చేస్తే జూనియర్ ఎన్టీఆర్ అలా చెబుతారా?

జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి సినిమా ఇండస్ట్రీలో కథలుకథలుగా చెప్పుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు మళ్లీ పుడతాడా అంటూ ఒక స్టార్ డైరెక్టర్ ఒక సందర్భంలో కామెంట్ చేశారంటే తారక్ ప్రతిభ స్థాయి ఏంటో అర్థమవుతుంది. కళ్లతో సైతం హావభావాలను అద్భుతంగా పలికించగల తారక్ ప్రతిభకు సంబంధించి ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షో సీజన్1 తో పాటు ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్ గా వ్యవహరించడం జరిగింది.

తారక్ (Jr NTR) హోస్టింగ్ అద్భుతంగా ఉన్నా ప్రశ్నలలో పొరపాట్లు, కంటెస్టెంట్ల ఎంపికలో పొరపాట్ల వల్ల ఆ షో అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు. జెమిని ఛానల్ లో ప్రసారమైన ఈ షో ఆ ఛానల్ లో ఒక సీజన్ కు మాత్రమే పరిమితం కావడం జరిగింది. రైటర్ లిఖిత్ శ్రీనివాస్ ఎన్టీఆర్ గురించి చెబుతూ బిగ్ బాస్ షో కోసం పని చేసిన కంపెనీ మీలో ఎవరు కోటీశ్వరులు షో కోసం పని చేసిందని ఛానెల్ మారినా ప్రొడక్షన్ టీమ్ సేమ్ అని ఆయన అన్నారు.

నాతో ఉన్న కంఫర్ట్ వల్ల ఆ ప్రొడక్షన్ టీమ్ వాళ్లు నన్ను పిలిచారని లిఖిత్ శ్రీనివాస్ అన్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు తరహా షో 16, 17 భాషల్లో జరిగిందని ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన మాట ఏంటంటే ఇప్పటివరకు ఏ హీరో కానీ ఏ హోస్ట్ కానీ ఒక్కరోజులో మూడు ఎపిసోడ్లు చేసిన రికార్డ్ లేదని అలా చేసిన రికార్డ్ తారక్ కు సొంతమైందని జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎడిట్ లో ఏం పోతుంది? టీవీలో ఏం టెలీకాస్ట్ అవుతుంది? అనే వాటిపై పరిపూర్ణ అవగాహన కలిగి ఉన్నారని తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ ఏకసంతాగ్రహి అని జూనియర్ ఎన్టీఆర్ తో పని చేయడం మిరాకిల్ అని ఆయన అన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు మూడు ఎపిసోడ్ల షూట్ పూర్తి చేసి ప్యాకప్ చెప్పేవారని ఆయన కామెంట్లు చేశారు. తారక్ తో పని చేస్తుంటే అసలు పని చేస్తున్న ఫీలింగ్ రాదని లిఖిత్ శ్రీనివాస్ అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే ఇది కరెక్ట్ కాదనుకుంటా క్రాస్ చెక్ చేసుకోండి అని తారక్ చెబుతాడని లిఖిత్ శ్రీనివాస్ తెలిపారు. ఆయన చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ చాలా జోవియల్ గా ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus