టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన వెంకటేశ్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. వెంకీ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. కలియుగ పాండవులు సినిమాతో వెంకటేశ్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విషయంలో రాఘవేంద్ర రావు ఎన్నో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. కలియుగ పాండవులు సినిమాలో వెంకటేశ్ రోల్ ను మొదట నెగిటివ్ షేడ్స్ లో చూపించి ఆ తర్వాత మార్పు వచ్చిన హీరో పాత్రను చూపించారు.
ఈ మూవీలోని క్లైమాక్స్ సీన్ లో హీరోని, హీరో ఫ్రెండ్స్ ను రాబందులతో పొడిపిస్తారు. ఫైట్ మాస్టర్ విజయన్ ఈ సన్నివేశం కోసం నిజమైన రాబందులను తీసుకొచ్చారు. రాబందులు వెంకటేశ్ మెడపై పొడుస్తున్నట్టు కనిపించడానికి వెంకటేశ్ వెనుక వైపు చెక్క ముక్క పెట్టి ఆ చెక్కముక్కకు మాంసం గుచ్చారు. అయితే ఈ సీన్ షూటింగ్ సమయంలో అక్కడ ఉన్న రాబందులు నిజమైన రాబందులు కావడంతో తనను నిజంగా ఎక్కడ పొడిచేస్తాయేమో అని వెంకటేశ్ భయపడ్డారని సమాచారం.
ఈ సినిమాలో వెంకటేశ్ ఒక సన్నివేశంలో ” వి ఫర్ విక్టరీ అన్నది పాత సామెత.. విజయ్ ఫర్ విక్టరీ అన్నది నేను సృష్టించిన సామెత” అని చెబుతాడు. తొలి సినిమాలో వెంకటేశ్ విక్టరీ అనే పదం పలకగా తర్వాత కాలంలో ఆ పదమే బిరుదుగా మారింది. గత కొన్నేళ్లుగా వరుస విజయాలు అందుకుంటున్న వెంకటేశ్ సైంధవ్ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటానని నమ్ముతున్నారు.
శేలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విభిన్నమైన కథతో తెరకెక్కుతోందని తెలుస్తోంది. కెరీర్ విషయంలో వెంకటేశ్ ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. వయస్సు పెరుగుతున్నా విక్టరీ వెంకటేష్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.