సినిమా విడుదల అయిన తర్వాత ఆ సినిమా పది మంది చూపించాలని ఎవరైనా అనుకుంటే.. టికెట్లు కొని ఇస్తుంటారు. వాటిని తీసుకెళ్లి థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తుంటాం. చాలా ఏళ్లుగా ఇదే జరుగుతోంది. ఇంకా సినిమా చూసే అవకాశం లేని వారికి కోసం కూడా కొంతమంది ఉచితంగా టికెట్లు ఇస్తారు. కానీ ‘ఆదిపురుష్’ సినిమా విషయంలో సినిమా రిలీజ్ కాకుండా ముందు నుండే జరిగింది. చాలామంది పెద్దలు సినిమాకు ఉచిత టికెట్లు కొన్నారు. అయితే ఆ తర్వాత దీని గురించి కొంతమంది మాత్రం బయటకు చూపించారు.
అయితే ఆ టికెట్‌ల విషయం పక్కన పెడితే.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సినిమా టికెట్ ధరలను బాగా తగ్గించారు. ‘ఆదిపురుష్’ సినిమా నిర్మాణ సంస్థ టి సిరీస్ సినీ ప్రియులకు ఇటీవల ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. 3డీ వెర్షన్‌కు సంబంధించిన ఈ సినిమా టికెట్లను రూ. 150 ప్రారంభ ధరతో ఇస్తామని ప్రకటించింది. అయితే దీనికి కొన్ని షరతులను విధించింది.. ఈ ఆఫర్ జూన్ 22, 23 తేదీల్లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. అంటే ఒక రోజు ఆఫర్ అయిపోయింది. ఇంకో రోజు మాత్రమే ఉంటుంది.
అయితే ఇక్కడ మెలిక ఏంటంటే.. ఈ స్పెషల్ ఆఫర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వర్తించదని క్లారిటీ ఇచ్చేసింది. రామాయణాన్ని 3డీలో ఎక్కువ మంది చూడాలనే ఉద్దేశంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు టి సిరీస్ పేర్కొంది. అంతేకాదు ఎడిటెడ్ వెర్షన్‌తో ఈసినిమా ప్రదర్శితమవుతుందని కూడా చెప్పింది. ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలైన సంగతి తెలిసిందే. వసూళ్ల పరంగా తొలి రోజుల్లో ఓకే అనిపించినా ఆ తర్వాత తుస్ మంది.
సినిమా పాత్రల గెటప్పులు, సంభాషణలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే ఆయా ప్రాంతాల్లో మంచి స్పందన వస్తే ఇతర ప్రాంతాల్లోనూ ఈ టికెట్ రేట్లు తీసుకొస్తారేమో చూడాలి. అలాగే ‘బ్రహ్మాస్త్ర’ సినిమా తరహాలో (Adipurush) ఈ సినిమా కూడా మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.