‘కంగువ’ (Kanguva) నుండి వేగంగా కోలుకున్న సూర్య (Suriya) వరుస సినిమాలు ఓకే చేస్తున్నాడు. వాటి అప్‌డేట్‌లు కూడా వేగంగా ఇస్తున్నాడు. కార్తిక్ సుబ్బరాజు (Karthik Subbaraj) సినిమాను ‘రెట్రో’ అంటూ అనౌన్స్ చేశాడు. ఆర్జే బాలాజీ సినిమా అప్‌డేట్‌లు కూడా వస్తున్నాయి. అంతేకాదు ఆ తర్వాతి సినిమా ఏంటి అనే విషయంలోనూ చిన్న క్లారిటీ వచ్చింది. తాజాగా ఆ సినిమా పేరు అంటూ ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆర్జే బాలాజీ సినిమా తర్వాత సూర్య..
Suriya
మన వెంకీ అట్లూరి (Venky Atluri) డైరక్షన్‌లో ఓ సినిమా చేస్తారు అని ఇప్పటికే వార్తలొచ్చాయి. సూర్య 46వ సినిమాగా తెరకెక్కునున్న ఈ చిత్రం మారుతి కారు నేపథ్యంలో సాగుతుంది అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లోనే తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మారుతి కారును కథా వస్తువుగా ఎంచుకున్నారట వెంకీ అట్లూరి. మారుతి కారు మన దేశానికి ఎలా వచ్చింది? దాని నేపథ్యం ఏమిటి? అనే అంశాలతో వెంకీ అట్లూరి కథ సిద్ధం చేసుకున్నారట.
మరి ఈ చరిత్రను ఎలా చూపిస్తారు అనేది చూడాలి. ఆ సినిమాకు ‘796 CC’ అనే టైటిల్ పెట్టారని తెలుస్తోంది. 796 CC ఇంజిన్‌తోనే మారుతి కార్లు ఇండియా మార్కెట్‌లోకి వచ్చాయి. ఆ తర్వాత ఇండియన్ ఆటో మెబైల్ ఇండస్ట్రీలో మారుతి కార్లు గేమ్ ఛేంజర్‌గా మారాయి. గతంలో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో ‘డెక్కన్ ఎయిర్‌లైన్స్’ ఫౌండర్ జీఆర్ గోపీనాథ్ జీవితాన్ని చూపించారు. ఇప్పుడు మారుతి కారు గురించి చెప్పబోతున్నారు.
మరి ఈ సినిమా సూర్యకు ఎంతటి పేరు తీసుకొస్తుందో చూడాలి. ఎందుకంటే ‘సూరరై పొట్రు’ / ఆకాశం నీ హద్దురా’కు విమర్శకుల ప్రశంసలు, అవార్డులు అందుకున్నాడు సూర్య. ఇక వెంకీ అట్లూరి సంగతి చూస్తే.. పరభాషా హీరోలను బాగా హ్యాండిల్ చేస్తారని పేరు. ‘సార్’తో (Sir) ధనుష్ (Dhanush)’ , ‘లక్కీ భాస్కర్’తో (Lucky Baskhar) దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) మంచి విజయాలు అందుకున్నారు. ఇక సూర్యకు కూడా ఓ మంచి విజయం అందిస్తే సరి.