వరుణ్ తేజ్ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శక్తిప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారుచాలా రోజుల క్రితమే మొదలైన ఈ సినిమా ఆ తర్వాత కాస్త స్లో అయ్యింది అనే టాక్ వచ్చింది. అయితే వరుణ్ ఇతర సినిమాల పనుల్లోకి వెళ్లడంతో ఆ సినిమా అప్‌డేట్స్ రాలేదు అని తాజా సమాచారం. అంతేకాదు ఆ సినిమా నుండి త్వరలో సాలిడ్ అప్‌డేట్ ఒకటి రాబోతోంది అని సమాచారం. ఈ సినిమాకు పేరును దాదాపు ఫిక్స్ చేసేశారట. త్వరలోనే అనౌన్స్ చేస్తారు అని సమాచారం.
వరుణ్ తేజ్‌కి జోడీగా మానుషి చిల్లర్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. వరుణ్ తేజ్ భారత వైమానిక దళ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. రాడార్ ఆఫీసర్‌గా మానుషి చిల్లర్ కనిపించనుంది. దీనికి ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. ఈ సినిమా కథను బట్టి ఈ పేరు అయితే బాగుంటుంది అని అంటున్నారు. యుద్ధం, ప్రేమ నేపథ్యంలో సాగే సినిమా అని గతంలోనే చెప్పారు. ఇప్పుడు సినిమా పేరు చూస్తుంటే అలానే అనిపిస్తోంది.
వాస్తవ సంఘటనల ప్రేరణతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా కోసం వరుణ్ తేజ్ తన లుక్‌ని కూడా మార్చుకున్నాడు. ఇక ఈ సినిమాను డిసెంబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారని సమాచారం. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్… గతంలో లాయర్‌గా చేశారు. రీసెర్చ్ చేసి కథ రాశారట.
వరుణ్‌తేజ్ (Varun Tej) సంగతి చూస్తే… ‘గాంఢీవధారి అర్జున’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఆగస్టు 25న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక వరుణ్ వ్యక్తిగత జీవితానికి వస్తే త్వరలోనే త్రిపాఠిని వివాహం చేసుకోనున్నాడు. ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.