వెంకటేష్ (Venkatesh Daggubati), త్రిష (Trisha) కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ (Aadavari Matalaku Arthale Verule). ‘లక్ష్మీ’ వంటి మాస్ సినిమా తర్వాత వెంకటేష్ చేసిన ఓ క్లాస్ సినిమా ఇది.’7/G బృందావన కాలనీ’ తో తెలుగులో కూడా ఓ మంచి హిట్టు కొట్టిన శ్రీ రాఘవ అలియాస్ సెల్వ రాఘవన్ దీనికి దర్శకుడు.’శ్రీ సాయి దేవా ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎన్.వి.ప్రసాద్ – శానం నాగ అశోక్ కుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) సంగీతం రూపొందిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి.
బాలమురుగన్ (B. Balamurugan) సినిమాటోగ్రఫీ అందించారు. 2007 ఏప్రిల్ 27న రిలీజ్ అయ్యింది ఈ సినిమా. రిలీజ్ రోజున ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ శ్రీ రాఘవ నేచురల్ టేకింగ్, వెంకటేష్ పెర్ఫార్మన్స్ కలగలిపి ఈ సినిమాని సూపర్ హిట్ గా నిలబెట్టాయి. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు సాధించింది.నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 18 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 6.80 cr |
సీడెడ్ | 1.93 cr |
ఉత్తరాంధ్ర | 2.59 cr |
ఈస్ట్ | 0.92 cr |
వెస్ట్ | 0.97 cr |
గుంటూరు | 1.63 cr |
కృష్ణా | 1.57 cr |
నెల్లూరు | 0.87 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 17.28 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.82 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 18.10 cr |
‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ చిత్రం రూ.13.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.18.10 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.4.3 కోట్ల లాభాలు మిగిల్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమాని టీవీల్లో ఎగబడి చూస్తూనే ఉన్నారు.