Acharya: అలా చేస్తే ఆచార్యకు బెనిఫిట్ కలుగుతుందా?

ఆచార్య సినిమాకు నెగిటివ్ టాక్ వల్ల జరుగుతున్న డ్యామేజ్ అంతాఇంతా కాదు. ఈ సినిమాను చూడాలని అనుకున్న ఆడియన్స్ సైతం వైరల్ అవుతున్న నెగిటివ్ టాక్ వల్ల ఈ సినిమాను చూసే విషయంలో ఆలోచిస్తున్నారు. మరోవైపు టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఈ సినిమాకు దూరంగా ఉంటున్నారు. ఈ రీజన్ వల్లే ఆచార్య సినిమా బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవు. సోమవారం నుంచి ఆచార్య సినిమాకు సాధారణ టికెట్ రేట్లు అమలు చేస్తే ఈ సినిమాకు కచ్చితంగా బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.

చిరంజీవి, చరణ్, కొరటాల శివ రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రమోషన్స్ లో వేగం పెంచాల్సి ఉంది. ఆచార్యలాంటి పెద్ద సినిమాలకు ప్రమోషన్స్ ఎంతో కీలకమని చెప్పవచ్చు. ఆచార్య ప్రమోషన్స్ ను పూర్తిగా వదిలేస్తే మాత్రం సినిమా కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆచార్య సోమవారం కలెక్షన్లు ఈ సినిమా తుది ఫలితాన్ని డిసైడ్ చేయనున్నాయి. బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడం, సమ్మర్ హాలిడేస్ ఈ సినిమాకు కలిసొస్తాయని చెప్పవచ్చు.

మొదట కొరటాల శివ సిద్ధం చేసిన కథను అదే విధంగా తెరకెక్కించి ఉంటే మాత్రం ఈ సినిమా మంచి ఫలితాన్ని అందుకుని ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆచార్య సినిమాకు పెరిగిన బడ్జెట్ భారం కూడా సమస్యగా మారింది. గతేడాది ఈ సినిమాను విడుదల చేసి ఉంటే నష్టాలు మరింత తగ్గి ఉండేవని కొంతమంది చెబుతున్నారు. ఆచార్య సినిమాకు చిరంజీవి, చరణ్ ఇప్పటివరకు రెమ్యునరేషన్ తీసుకోలేదు.

ఆచార్య ఫలితం చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడంతో చిరంజీవి, చరణ్ రెమ్యునరేషన్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఆచార్య సినిమా రిజల్ట్ వల్ల కొరటాల శివకు రెమ్యునరేషన్ దక్కే ఛాన్స్ కూడా లేదని బిజినెస్ వ్యవహారాల్లో జోక్యం వల్లే కొరటాల శివ విషయంలో ఈ విధంగా జరిగిందని బోగట్టా.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus