కొద్దిసేపటి క్రితం ‘రాధే శ్యామ్’ కొత్త ట్రైలర్ అనగా రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. గత ట్రైలర్ కు మాదిరే ఇందులో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కు కావాల్సిన ఫైట్లు, పంచ్ డైలాగులు వంటివి ఏమీ లేవు. కానీ ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. హీరోయిజాన్ని ఇలా కూడా ఎలివేట్ చేసేలా..ఎ,బి, సి సెంటర్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఈ ట్రైలర్ ఉంది.హస్త సాముద్రిక నిపుణుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు.
చెయ్యి చూసి ఎలాంటి వారి భవిష్యత్తు అయినా ఈయన చెప్పేయగలడు. ఇతన్ని కలవడానికి గొప్ప గొప్ప వారు వస్తుండడాన్ని కూడా ట్రైలర్లలో చూపించారు.హీరోయిన్ పూజా హెగ్డే చాలా గ్లామర్ గా కనిపిస్తుంది. అయితే ఈ ట్రైలర్లో చిన్న మిస్టేక్ జరిగింది. వివరాల్లోకి వెళితే… ‘రాధే శ్యామ్’ లో విక్రమాదిత్య(ప్రభాస్) గురువు పరమహంస పాత్రలో కృష్ణంరాజు నటించారు. గతంలో విడుదల చేసిన ట్రైలర్లో అయితే తెలుగు వెర్షన్లో కృష్ణంరాజు కనిపించారు.
‘ఐ కాల్డ్ హిం, ఐన్ స్టీన్ ఆఫ్ పామ్ హిస్టరీ’ అంటూ కృష్ణంరాజు డైలాగ్ చెప్పడం ఆ ట్రైలర్ కు హైలెట్ అయ్యింది. హిందీలో ఆ పాత్రని సత్య రాజ్ పోషిస్తున్నారు. కానీ తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో అయితే సత్యరాజ్ కనిపించారు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పొరపాటున అన్ని వెర్షన్లకి కలిపి ఒకే ట్రైలర్ ను రెడీ చేసి ఉంటారు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Actor Sathyaraj is seen in Telugu version of #RadheShyamreleasetrailer. Looks like they have gone with the same cut in all languages. Krishnam Raju played the role of Vikramaditya guru in Telugu version! And Sathyaraj played it in other versions! pic.twitter.com/NW0eGkMne2