సినిమా ఇండస్ట్రీలో కొన్ని లాంగ్ టర్మ్ గొడవలు ఉన్నాయి. ఎందుకు ఆ గొడవ మొదలైంది, ఎంతవరకు వెళ్తుంది అనే వివరాలు ఇప్పటి జనాలకు తెలియవు. దీంతో ఆ ఇద్దరూ ఎందుకు గొడవ పడుతుంటారు? కలసి నటించరు ఎందుకు? అని ప్రశ్నలు వేస్తుంటారు. అలాంటి వైరాల్లో రజనీకాంత్ (Rajinikanth) – సత్య రాజ్ (Sathyaraj) ఒకటి. తమిళ సినిమా పరిశ్రమలో ఈ వైరం ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్లుగా ఇద్దరు అగ్ర నటుల మధ్య సమస్య ఉంది. అయితే ఇప్పుడు అది తేలిపోయింది అంటున్నారు.
రజనీకాంత్ సినిమాల్లో సత్యరాజ్‌ను మనం చూడలేం. ఎందుకంటే 38 ఏళ్ల క్రితం కలసి నటించిన ఈ ఇద్దరూ తర్వాత మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించలేదు. అయితే ఇప్పుడు ‘కూలి’ సినిమా కోసం ఇద్దరూ కలసి నటిస్తున్నారు అని అంటున్నారు. ఈ మేరకు దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యి రజనీకాంత్‌తో కలసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సత్యరాజ్ ఓకే అన్నారు అని చెబుతున్నారు. ఈ క్రమంలో అప్పుడేమైంది అనే చర్చ మొదలైంది. సుమారు 30 ఏళ్ల క్రితం అంటే 1994లో రజినీకాంత్ ‘వీరా’ సినిమా విడుదలై భారీ విజయం అందుకుంది.
అదే సమయంలో సత్యరాజ్ – సుకన్య జంటగా నటించిన ఓ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అలా వచ్చిన రెండు హిట్టయ్యాయి కానీ బిజినెస్ విషయంలో తన పట్ల డిస్ట్రిబ్యూటర్లు వివక్ష చూపించారని సత్యరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తన సినిమా విజయోత్సవం కోసం ప్లాన్ చేసుకుంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదట. ఆ తర్వాత అదే ప్రాంతంలో రజనీకాంత్ సినిమాకు ఛాన్స్ ఇచ్చారట. దీంతో కర్ణాటక నుండి వచ్చిన బయటివాడిని తమిళనాడు సర్కారు నెత్తినబెట్టుకుందని సత్యరాజ్ విమర్శలు చేశారట.
ఆ తర్వాత చాలా ఏళ్లకు ‘శివాజీ’ (Sivaji) సినిమాలో విలన్ పాత్ర కోసం సత్యరాజ్‌ను కాంటాక్ట్ అయ్యారు. అయితే సత్యరాజ్ ఓకే చెప్పలేదట. దీంతో ఆ పాత్రలోకి సుమన్ వచ్చారు. ఇప్పుడు ఇన్నేళ్లకు వీలవుతోంది అంటున్నారు. ఇక చివరిసారి బాలచందర్ (K. Balachander) దర్శకత్వంలో 1987 వచ్చిన ‘మనతిల్ ఉరుది వేండుం’ అనే సినిమాలో రజనీకాంత్ – సత్యరాజ్ అతిథి పాత్రలు చేశారు. తెలగులో ఆ సినిమాను ‘సిస్టర్ నందిని’ పేరుతో విడుదల చేశారు.