సినీ ఇండస్ట్రీని విషాదాలు వీడటం లేదు. కొన్నాళ్లుగా ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తండ్రి మరణించిన సంగతి తెలిసిందే. అటు తర్వాత స్టార్ నటుడు నాజర్ తండ్రి కూడా వయసు సంబంధిత సమస్యలతో మరణించారు.అలాగే మలయాళ నటుడు కుందర జానీ, విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు,బాలీవుడ్ నటి భైరవి ఇలా చాలా మంది కన్నుమూశారు.
ఈ మధ్యనే ‘సింగం’ దర్శకుడైన హరి తండ్రి వీఏ గోపాలకృష్ణన్ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది. ఓ శృంగార నటి సోదరుడు అనుమాస్పదంగా మరణించాడు. వివరాల్లోకి వెళితే.. శృంగార తారగా పిలవబడే సీనియర్ నటి బాబిలోనా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె సోదరుడు విక్కీ అనుమానాస్పద రీతిలో కన్నుమూశారు. అతని నివాసంలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు అని స్పష్టమవుతుంది. అయితే అతనిది హత్య లేక ఆత్మహత్య అనే దానిపై స్పష్టత రాలేదు.
విక్కి గతంలో ఓ రౌడీ అని అంతా అంటుంటారు. అతని శత్రువులే టైం చూసుకుని అతని ప్రాణాలు తీసినట్టు స్పష్టమవుతుంది. గతంలో అతను మద్యం మత్తులో ఓ వ్యక్తి తల పగలగొట్టాడు. అటు తర్వాత చాలా కేసుల్లో అతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మరి నిజమేంటో పోలీసులే విచారించి చెప్పాల్సి ఉంది. ఇక బాబిలోనా గతంలో ఎన్నో సినిమాల్లో వ్యాంప్ పాత్రలు చేసింది. కొన్నాళ్ల తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసి ఓ ఫిట్నెస్ ట్రైనర్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!