Daksha Nagarkar: నాగచైతన్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన నటి దక్షా!

హోరా హోరి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి దక్షా నగార్కార్ అందరికీ సుపరిచితమే. ఇలా పలు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తున్నటువంటి ఈమె తాజాగా రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు .ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీ విడుదలకు సిద్ధం అవుతుంది. ధమాకా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ నటించిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి దక్షా నగార్కార్ (Daksha Nagarkar) ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. నాగార్జున నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో ఈమె ఒక పాటలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా ఈవెంట్ లో ఈమె నాగచైతన్యకు కళ్ళు తో సైగలు చేసిన వీడియో అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ అయింది.

ఇలా ఈ ఘటన చోటు చేసుకోవడంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. ఇకపోతే తాజాగా మరోసారి దక్షా నగార్కార్ నాగచైతన్య గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ నాగచైతన్య చాలా సింపుల్ గా ఉంటారు. ఈయనకు అమ్మాయిలంటే ఎంతో గౌరవం అలాగే వారిని చాలా కేర్ గా చూసుకుంటారు.

ఇక బంగార్రాజు సినిమా షూటింగ్ సమయంలో భాగంగా తనని హగ్ చేసుకుని ముద్దు పెట్టే సన్నివేశాలు కనుక వస్తే నాగచైతన్య ఎంతో ఇబ్బంది పడేవారని తెలియజేశారు.ఇక తప్పనిసరి పరిస్థితులలో అలా చేసిన షూటింగ్ పూర్తి అయిపోగానే తన వద్దకు వచ్చి సారీ చెప్పేవారని ఈ సందర్భంగా దక్షా నగార్కార్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus