ఎస్తర్ నోరోన్హా అందరికీ సుపరిచితమే. తేజ దర్శకత్వంలో రూపొందిన ‘1000 అబద్దాలు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సునీల్ సరసన భీమవరం బుల్లోడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఈమెకు అవకాశాలు రాలేదు. తర్వాత ఈమె సింగర్ నోయల్ సేన్ ను పెళ్లి చేసుకుంది. తర్వాత ఏడాదికే వీళ్లు విడాకులు తీసుకోవడం జరిగింది. అటు తర్వాత ఈమె ఒకటి రెండు గ్లామర్ సినిమాల్లో నటించింది.
ఇప్పుడు రూటు మార్చి… నిర్మాతగా , దర్శకురాలిగా, మారుతుంది అని చెప్పాలి. అది కూడా ఒక పాన్ ఇండియా చిత్రంతో. వివరాల్లోకి వెళ్తే… ఎస్తర్ ‘ది వేకెంట్ హౌస్’ అనే చిత్రంలో నటించింది.జానెట్ నోరోన్హా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్తర్ నోరోన్హా తల్లి జానెట్ నోరోన్హా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఎస్తర్ రచనా,దర్శకత్వంతో పాటు సంగీతం కూడా అందిస్తున్నారు. అయితే ఈ సినిమాతో తాను దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.
సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఆద్యాంతం ప్రేక్షకలను అలరించే సబ్జెక్ట్ ఉండడంతో ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్ భాషాల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. ఇక గతంలో జానెట్ నొరోన్హా ప్రొడక్షన్స్ “సోఫియా” ఏ డ్రీమ్ గర్ల్ అనే కొంకణి మూవీని నిర్మించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాతో ఎస్తర్ కి ఎలాంటి రిజల్ట్ ను సాధిస్తుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. చూడాలి మరి