Mrunal Thakur: హ్యాకింగ్ కు గురైన నటి మృణాల్ మెయిల్… అదిరిపోయిన ట్విస్ట్!

సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో సీతామహాలక్ష్మి పాత్ర ద్వారా ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్నటువంటి ఈమె ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని నేచురల్ స్టార్ నానితో చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈమె మాత్రం పలు వెకేషన్ లకు వెళుతూ ఎంతో సందడి చేస్తున్నారు. ఇలా తన వెకేషన్ కి సంబంధించిన అన్ని వీడియోలను ఫోటోలను అభిమానులతో పంచుకున్న మృణాల్ తాజాగా తనకు హ్యాకర్స్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అలాగే తన మెయిల్ హ్యాక్ చేశారంటూ ఒక వీడియోని విడుదల చేశారు.

సైబర్ నేరగాళ్లు తన మెయిల్ హ్యాక్ చేయడమే కాకుండా తనకు బెదిరిస్తున్నారంటూ ఈమె ఒక వీడియో విడుదల చేస్తూ తెలియజేశారు. నా వ్యక్తిగత సమాచారం నా సినిమాలకు సంబంధించిన స్క్రిప్స్ అన్నీ కూడా అందులోనే ఉన్నాయి అంటూ ఆందోళన చెందారు. ఇలా ఈమె ఈ వీడియోని షేర్ చేయడంతో అందరూ నిజమేనని భావించారు. అయితే ఇంత సీరియస్ గా,ఆందోళన చెందుతూ ఈ వీడియో షేర్ చేసినప్పటికీ ఇందులో ఏమాత్రం నిజం లేదంటూ చివరిలో ట్విస్ట్ ఇచ్చారు.

ఇదంతా కూడా తాను కేవలం వెంకటేష్ రానా నటించినటువంటి రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా చేస్తున్నదని తెలియడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.ఇక ఈ వీడియో చివరిలో మెయిల్ హ్యాక్ అయితే దాని నుంచి ఎలా బయటపడాలో రానా నాయుడు వెబ్ సిరీస్ చూడండి అంటూ ఈ వెబ్ సిరీస్ ప్రమోట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ లో రానా సెలబ్రిటీలు ఇలాంటి ఇబ్బందులలో ఉంటే వారిని సేవ్ చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే సెలబ్రిటీలు కూడా ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగమయ్యారు. అయితే నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్నటువంటి ఈ వెబ్ సిరీస్ తెలుగులో పెద్దగా ఆదరణ సంపాదించుకోలేకపోయినా బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం మంచి ఆదరణ సంపాదించుకుంది. ఫ్యామిలీ హీరోగా ఎంతో పేరు సంపాదించుకున్న వెంకటేష్ ఇలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్నటువంటి వెబ్ సిరీస్ లో నటించడంతో తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ వెబ్ సిరీస్ ను జీర్ణించుకోలేకపోతున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus