Balakrishna, Poorna: బాలయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూర్ణ!

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అఖండ మూవీ మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రముఖ నటి పూర్ణ పద్మావతి అనే పాత్రలో నటించారు. అఖండ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన పూర్ణ తాను చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా చూడనని కథను కథలా వింటానని అన్నారు. 2011 సంవత్సరంలో తన తొలి సినిమా సీమ టపాకాయ్ రిలీజైందని పదేళ్ల ప్రయాణం తర్వాత అఖండలాంటి పెద్ద మూవీలో భాగమయ్యానని పూర్ణ తెలిపారు. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో తనకు కొన్ని పరిమితులు ఉండేవని పాత్రలు,

కాస్ట్యూమ్స్ విషయంలో ఉన్న పరిమితుల వల్ల అన్ని రకాల పాత్రలు చేయలేకపోయానని పూర్ణ అన్నారు. బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ మూవీలో భాగమైనందుకు సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. నచ్చితే మాత్రమే ఏ పాత్రైనా ఒప్పుకుంటానని పాత్ర డిమాండ్స్ ను బట్టి క్యాస్టూమ్స్ వేసుకుంటానని పూర్ణ చెప్పుకొచ్చారు. మంచి సినిమాలను ఎంచుకుంటే మాత్రమే కెరీర్ బాగుంటుందని కెరీర్ తొలినాళ్లలో కొన్ని తప్పులు చేశానని ఆమె తెలిపారు. ఢీ షో తనకు ప్లస్ అయిందని ఆ షో వల్లే తెలుగు బాగా మాట్లాడుతున్నానని పూర్ణ చెప్పుకొచ్చారు.

గతంలోనే బోయపాటి శ్రీను సినిమాలో ఆఫర్ వచ్చినా కొన్ని రీజన్స్ వల్ల తాను చేయలేకపోయానని పూర్ణ అన్నారు. అఖండలో తన రోల్ నెగటివ్ రోల్ కాదని తక్కువ నిడివితో ఉన్న బలమైన పాత్ర అని పూర్ణ తెలిపారు. బాలయ్యకు పోటాపోటీగా డైలాగ్స్ చెప్పడానికి తాను భయపడ్డానని అయితే బాలయ్య తనకు ఎంతో సహకరించారని పూర్ణ చెప్పుకొచ్చారు. సెట్ లో బాలయ్యను అఘోరా పాత్రలో చూస్తుంటే దేవుడిని చూసినట్లుగా అనిపించేదని పూర్ణ కామెంట్లు చేశారు. ఇతర భాషల్లో కూడా తాను సినిమాలు చేస్తున్నానని పూర్ణ తెలిపారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Share.