Priyanka Naidu: అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న ప్రియాంక- మధుబాబు!

‘వదినమ్మ’ ఫేమ్ ప్రియాంక నాయుడు అందరికీ సుపరిచితమే.తర్వాత ఈమె ‘దీపారాధన’ సీరియల్ లో కూడా నటించి మెప్పించింది. ఇక 2021 జనవరిలో ప్రియాంక.. తాను ప్రేమించిన అబ్బాయి, టీవీ నటుడు అయిన మధుబాబును పెళ్లి చేసుకుంది.మధుబాబు .. ‘మంగమ్మగారి మనవరాలు’ సీరియల్‌లో సాకేత్‌గా ఇతను బాగా పాపులర్. ఆ తర్వాత ‘అభిషేకం’, ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’, ‘రెండు రెళ్లు ఆరు’… ఇలా వరుస సీరియల్స్‌తో బుల్లితెర పై బిజీ ఆర్టిస్ట్ గా రాణించాడు.

అయితే ఈ జంట కొంతకాలంగా సీరియల్స్ కు దూరంగా ఉంటున్నారు. వదినమ్మ తర్వాత (Priyanka Naidu) ప్రియాంక సీరియల్స్ కు దూరమైంది. ఇక మధుబాబు కూడా సీరియల్స్ కు దూరమయ్యాడు.అయితే సోషల్ మీడియా ద్వారా ఈ జంట అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. ఇటీవల మధుబాబు పుట్టినరోజు కావడంతో తన ఫాలోవర్స్ పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో అందరికీ స్పెషల్ థాంక్స్ చెప్పిన ఈ జంట.. కొన్ని ఫోటోలు, అలాగే ఓ వీడియో కూడా షేర్ చేయడం జరిగింది.

ఇక ఇదే క్రమంలో త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ప్రియాంక నాయుడు ప్రెగ్నెంట్. ఈ గుడ్ న్యూస్ ను వారు స్వయంగా అభిమానులతో షేర్ చేసుకోవడం జరిగింది. దీంతో వీరి ఫాలోవర్స్ పెద్ద ఎత్తున తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తున్నారు. అలాగే ప్రియాంక పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus