Samantha: ఇతరుల కష్టం విలువ మీకు తెలియదు.. దయతో ఉండండి: సమంత

  • February 17, 2023 / 12:48 PM IST

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత చాలా డిప్రెషన్ కి గురైంది. ఆ డిప్రెషన్ నుండి బయటపడటానికి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవల మయోసైటీసిస్ అనే చర్మ వ్యాధితో అనారోగ్యం పాలయింది . ఈ వ్యాధి కారణంగా సమంత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది. ఇక ఇటీవల సమంత ఈ వ్యాధి నుండి కోలుకొని మళ్ళీ షూటింగ్లలో పాల్గొంటుంది.

తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ పనులలో సమంత బిజీగా ఉంది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఖుషి సినిమా షూటింగ్ లో సమంత పాల్గొననుంది. ఇలా అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత సమంత వరుస షూటింగ్ లతో బిజీగా మారిపోయింది. ఇలా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నా కూడా సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. అయితే నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత డివోషనల్ వైపు మళ్ళింది.

ఇలా తరచూ మోటివేషనల్ కొటేషన్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా కూడా సమంత సోషల్ మీడియా ద్వారా ఒక కొటేషన్ షేర్ చేసింది. సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్టు లో సమంత ” ఎదుటివారు తన జీవితం కోసం ఇంత కష్టపడుతున్నారు ఎంత పోరాడుతున్నారు అన్న విషయం గురించి మీకు తెలియదు. అందుకే ఇతరుల పట్ల దయతో మెలగండి” ఆని అర్ధం వచ్చే విధంగా కొటేషన్ షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. సమంత విడాకులు తీసుకున్న సమయంలో చాలమంది అమెను తప్పు పడుతూ ట్రోల్ చేశారు. అంతే కాకుండా నాగచైతన్యని మోసం చేయటం వల్లే ఆమెకి ఇలా అనారోగ్య సమస్యలు వచ్చాయని ఇప్పటికీ నెగటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. అందువల్ల అలాంటి వారిని ఉద్దేశిస్తూ సమంత ఈ పోస్ట్ షేర్ చేసింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus