సినిమా వాళ్ళ ప్రేమ, పెళ్లి వ్యవహారాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఇటీవల ఓ స్మాల్ స్క్రీన్ నటి సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకుంటుంది అనే వార్త పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది.
వివరాల్లోకి వెళితే.. నటి సాండ్రా జై చంద్రన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. సీరియల్ నటుడు మహేష్ కాళిదాసన్ తో ఈమె ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల నుండి వీళ్ళు రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. మొత్తానికి ఇటీవల వాళ్ళు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ఓ షోలో పాల్గొన్న వీళ్ళు స్టేజిపై ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరం తొడిగి మరీ సాండ్రాకి ప్రపోజ్ చేశాడు మహేష్.
‘మనసిచ్చి చూడు’ ‘శుభస్య శీఘ్రం’ సీరియల్స్ లో హీరోగా నటించి పాపులర్ అయ్యారు మహేష్ కాళిదాసన్. ఇక సాండ్రా ‘కలవారి కోడళ్ళు’ ‘ముద్దమందారం’ ‘ఆటో విజయశాంతి’ వంటి సీరియల్స్ లో నటించి మెప్పించింది. ‘శుభస్య శీఘ్రం’ సీరియల్లో ఇద్దరూ కలిసి నటించారు.
ఆ టైంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ సీరియల్ తర్వాత ‘SAMA’ అనే యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసింది ఈ జంట. అందులో వీళ్ళు కలిసి ట్రిప్పులకు వెళ్ళిన వీడియోలు వంటివి పోస్ట్ చేశారు. ఇకపోతే సాండ్రాకి ఆల్రెడీ పెళ్లైంది. 19 ఏళ్ళకే పెళ్లి చేసుకున్న ఆమె.. భర్త వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు అని తెలిసి విడాకులు తీసుకుంది. సో ఇప్పుడు ఆమె 2వ పెళ్లి చేసుకోబోతుందని స్పష్టమవుతుంది.