‘పెళ్ళి సందD’ తో తళుక్కున మెరిసింది శ్రీలీల (Sreeleela) . ఆ సినిమా పెద్దగా బాగోకపోయినా.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడంలో శ్రీలీల గ్లామర్ హస్తం ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. డాన్సుల్లో కూడా శ్రీలీల గ్రేస్ అందరికీ నచ్చింది. అందుకే ఆమెకు వరుస సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. ఈ క్రమంలో ‘ధమాకా’ (Dhamaka) ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) వంటి సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. దీంతో ఆమెకు ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) వంటి పెద్ద సినిమాల్లో నటించే ఛాన్స్ లభించింది.
Sreeleela
అయితే మధ్యలో చేసిన ‘ఆదికేశవ’ (Aadikeshava) ‘ఎక్స్ట్రా’ (Extra Ordinary Man) వంటి సినిమాలు డిజాస్టర్లు కావడంతో శ్రీలీల రేసులో వెనుకబడింది. ఈ గ్యాప్లో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) ఎంట్రీ ఇచ్చి ఆమెను మరింత వెనక్కి నెట్టింది. దీంతో శ్రీలీల పని అయిపోయింది అని అంతా అనుకున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఆమెకు ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) లో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ లభించింది. శ్రీలీల చేసిన ఫస్ట్ ఐటెం సాంగ్ ఇది. దీని కోసం కోటిన్నర పారితోషికం అందుకున్నట్టు వినికిడి.
ఈ పాట చేయడం వల్ల శ్రీలీలకి బాగానే కలిసొచ్చింది. ‘కిసిక్’ అనే పదం దేశవ్యాప్తంగా ఓ ఊపు ఊపేస్తోంది. నార్త్ లో కూడా శ్రీలీల పేరు మార్మోగుతుంది. ఈ క్రమంలో ఆమెకు బాలీవుడ్ సినిమాల్లో నటించమంటూ కాల్స్ వస్తున్నాయట. మరోపక్క టాలీవుడ్లో కూడా శ్రీలీలకి ఐటెం సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ చేయమని భారీ పారితోషికాలతో ఆఫర్లు ఇస్తున్నారట.
దీంతో శ్రీలీల ఇక ఐటెం సాంగ్స్ చేయకూడదు అని డిసైడ్ అయ్యిందట. బాలీవుడ్లో యంగ్ హీరోల సరసన హీరోయిన్ గా చేసే ఛాన్స్ వస్తే చాలు అని ఆమె ఫీల్ అవుతుందట. మరోపక్క కోలీవుడ్లో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) వంటి హీరోల సరసన కూడా ఈమె హీరోయిన్ గా నటించే ఛాన్సులు దక్కించుకుంటుంది.అందుకే ఆమె ఐటెం సాంగ్స్ కి దూరంగా ఉండాలి అనుకుంటుంది అని ఇండస్ట్రీ టాక్.