సినీ పరిశ్రమలో మరో విషాదం.. అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నటి!

వరుస మరణాలు, ప్రమాదాలు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి.. ‘కళాతపస్వి’ కె. విశ్వనాథ్, గాయని వాణీ జయరాం మరణ వార్త ఇంకా మర్చిపోకముందే.. నందమూరి తారక రత్న కన్నుమూశారు.. ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ మైల్ స్వామి, ప్రముఖ కన్నడ దర్శకుడు ఎస్.కె. భగవాన్, మంగళవారం (ఫిబ్రవరి 21) సీనియర్ ఎడిటర్ జీ జీ కృష్ణారావు, సీనియర్ నటి బేలా బోస్ వంటి వారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు..ఈ వార్తలు మర్చిపోకముందే మరో ప్రముఖ యువనటి ఇకలేరు అనే వార్తతో పరిశ్రమ షాక్ అయింది..

వివరాల్లోకి వెళ్తే.. సుబి సురేష్.. యాంకర్, యాక్ట్రెస్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.. ఆమెకు మలయాళంలో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన సుబి సురేష్.. ఆ తర్వాత పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించారు..‘హ్యాపీ హస్బెండ్స్’, ‘కనక సింహాసనం’ వంటి సినిమాల్లోనూ కామెడీ క్యారెక్టర్లలో నటించి అలరించారు.. పిల్లల షో, కుకింగ్ షో కూడా చేశారామె.. సుబి కొద్ది కాలంగా లివర్ సమస్యలతో బాధపడుతున్నారు..

కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. పరిస్థితి చేయి దాటడంతో బుధవారం (ఫిబ్రవరి 22) ఉదయం తుదిశ్వాస విడిచారు.. ఆమె వయసు 41 సంవత్సరాలు.. ఆమెకు తల్లిదండ్రులు, సోదరుడు ఉన్నారు.. సుబి సురేష్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సహా మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన వారు సంతాపం తెలియజేస్తున్నారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus