Prabhas: ప్రభాస్‌ సినిమాల లైనప్‌పై సూపర్‌ ఎఫెక్స్ట్‌.. తప్పదు మరి!

ఓ సినిమా వాయిదా పడితే.. వేరే సినిమా మీద ప్రభావం కచ్చితంగా పడుతుంది. అదే వరుస సినిమాలు చేసే హీరోలకు అయితే ఇంకా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడు ప్రభాస్‌. ఆటోమేటిగ్గా అతని ఫ్యాన్స్‌ కూడా. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతో కాలంగా ఎదురుచూసి.. ఇప్పుడు ఎందుకు ఎదురుచూశామా అని అనుకుంటున్న సినిమా ‘ఆదిపురుష్‌’. నిజానికి సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమాను జూన్‌కి వాయిదా వేశారు. అయితే దీని వల్ల ప్రభాస్‌ తర్వాతి సినిమా ‘సలార్‌’ మీద కూడా ఎఫెక్ట్‌ పడుతుందా? ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది.

ప్రభాస్ – ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్‌’. మాస్‌ ఓవర్‌లోడెడ్‌ యాక్షన్‌ సినిమా రూపొందుతున్న ‘సలార్‌’ను సెప్టెంబరు 28, 2023న విడుదల చేయాలని నిర్ణయించారు. దానికి తగ్గట్టుగా సినిమా పనులు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ‘ఆదిపురుష్‌’ సినిమా వాయిదా పడిన నేపథ్యంలో ‘సలార్‌’ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారా అనే ప్రశ్న ఒకటి వినిపిస్తుంది. ఒకవేళ అది జరగకపోతే.. సెప్టెంబరులో సినిమాను విడుదల చేయడం కష్టం.

మరోవైపు ప్రభాస్‌ మారుతి సినిమాలో కూడా నటిస్తున్నారు. అలాగే నాగ్‌ అశ్విన్‌ ‘ప్రాజెక్ట్‌ కె’ పనులు కూడా జరుగుతున్నాయి. ‘ఆదిపురుష్‌’ వాయిదా నేపథ్యంలో ఆ సినిమాల మీద కూడా ఎఫెక్ట్‌ పడుతుంది అంటున్నారు. మామూలుగా సినిమా వాయిదా పడితే మిగిలిన సినిమాలకు అంతగా ఇబ్బంది ఉండదు. అదే రీషూట్లు, రిపేర్ల వల్ల వాయిదా పడితే మాత్రం కచ్చితంగా ఇబ్బందే. ఇప్పుడు ‘ఆదిపురుష్’ను అందుకే వాయిదా వేశారు అని అంటున్నారు. కాబట్టి మిగిలిన సినిమాలకు ఇబ్బందే అని చెప్పొచ్చు.

‘ఆదిపురుష్‌’ సినిమా టీజర్‌ విడుదలైన తర్వాత అటు అభిమానుల నుండి, ఇటు ఓ వర్గం ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రామాయణాన్ని వక్రీకరించే ప్రయత్నం అంటూ ఓ వర్గం ప్రజలు అంటుంటే, ప్రభాస్‌ను అలా కార్టూన్‌ బొమ్మలా చూపిస్తారా అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సినిమాకు రిపేర్లు చేస్తున్నారని టాక్‌. అందుకే రిలీజ్‌ సంక్రాంతి నుండి వాయిదా పడిందట.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus