‘ఆదిపురుష్’ చిత్రం చాలా వివాదాల్లో చిక్కుకుంది. కొన్ని ప్రాంతాల్లోని రామభక్తులు ఈ చిత్రం పై కేసులు వేయడం కూడా జరిగింది. నేపాల్ లో ఈ చిత్రం ప్రదర్శనలు నిలిపివేశారు. అంతేకాదు అక్కడ ఇండియన్ సినిమాలను రిలీజ్ చేయనివ్వమని ఆదేశాలు జారీ చేశారు. అందుకోసమే అనుకుంట సోమవారం నాడు ‘ఆదిపురుష్’ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఇలాంటి టైంలో ఆదిపురుష్ రచయిత మనోజ్ శుక్లా మరింత వివాదాలు రేపేలా కామెంట్లు చేస్తున్నారు. ‘ఆదిపురుష్’ లోని కొన్ని డైలాగ్స్ విషయంలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ..
‘మేము తీసింది రామాయణమే కాదు’ .. దాని స్పూర్తితో మరో కథ రాసుకున్నాం’ అంటూ కామెంట్లు చేశారు. గతంలో అయితే ‘రామాయణాన్ని మరింతగా చక్కగా చూపించబోతున్నాము’ అంటూ ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశారు. వీటికే వివాదాలు ఓ రేంజ్లో వస్తుంటే.. ఇప్పుడు మరికొన్ని వివాదాస్పద కామెంట్లు చేశారాయన. (Adipurush) ‘ఆదిపురుష్’లోని హనుమంతుని పాత్రతో అనుచితమైన డైలాగ్స్ చెప్పించిన మనోజ్ శుక్లా..ఇప్పుడు హనుమంతుడు దేవుడే కాదు అంటూ కామెంట్లు చేశారు.
‘‘హనుమంతుడు శ్రీరాముడిలా మాట్లాడడు. తాత్వికంగా మాట్లాడడు. ఆయన భగవంతుడు కాదు.. భక్తుడు. రాముడికి హనుమంతుడు వీర భక్తుడు మాత్రమే. దేవుడు కాదు. హనుమంతుడి భక్తికి శక్తులు వచ్చాయి కాబట్టి.. ఆయన్ని మనం దేవుడిని చేశాం’’ అంటూ ఘోరమైన కామెంట్లు చేశారు. ఈ కామెంట్లు చేసి హనుమంతుడితో అలాంటి డైలాగులు చెప్పించడంలో తప్పేమీ లేదు అన్నట్టు ఆయన సమర్ధించుకున్నారు. ఆయన వ్యాఖ్యలతో సినిమాకి మరింత డ్యామేజ్ అయ్యే ప్రమాదం లేకపోలేదు.