మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ‘విశ్వంభర’ (Vishwambhara) షూటింగ్లో పాల్గొంటున్నారు. ‘బింబిసార’ (Bimbisara) ఫేమ్ మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. మార్చి చివరి నాటికి చిరు పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని వినికిడి. ఆ తర్వాత ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేసుకుంటున్నారు చిరు. అటు తర్వాత ‘విశ్వంభర’ డబ్బింగ్ పనులు పూర్తి చేసి.. దర్శకుడు అనిల్ రావిపూడితో (Anil Ravipudi) చేయబోయే సినిమాపై ఫోకస్ పెడతారు.
2026 సంక్రాంతి కానుకగా ఆ సినిమా రిలీజ్ అవుతుంది. అటు తర్వాత చిరు … ‘దసరా’ (Dasara) ఫేమ్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు. ఆల్రెడీ ఈ ప్రాజెక్టు గురించి అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. హీరో నానితో (Nani) కలిసి సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. 2026 లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అని.. నిన్న ‘కోర్ట్’ (Court) సినిమా ఈవెంట్లో భాగంగా నాని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.
అదేంటి అంటే.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరు చేస్తున్న సినిమా.. పూర్తిగా యాక్షన్ బ్యాక్ డ్రాప్లో ఉంటుందట. చిరు ఈ తరహా కథ గతంలో చేయలేదు అని అంటున్నారు. ‘విక్రమ్’ (Vikram) లో కమల్ హాసన్ (Kamal Haasan), ‘జైలర్’ (Jailer) లో రజినీ (Rajinikanth) మాదిరి.. వయసు మీద పడ్డ వ్యక్తిగా ఇందులో చిరు కనిపిస్తారు అని తెలుస్తుంది. చిరు సరసన సీనియర్ హీరోయిన్ ను తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీని సంప్రదించినట్లు టాక్ వినిపిస్తుంది. ఇది నిజమైతే కనుక రాణి ముఖర్జీ (Rani Mukerji) తెలుగులో చేయబోయే మొదటి సినిమా ఇదే అవుతుంది.