కామెడీ రియాలిటీ షోస్ అంటే… స్టేజీ మీద నటులు కామెడీ చేయడం, ఎదురుగా ఇద్దరు జడ్జిలు వాళ్లకు మార్కులు ఇవ్వడం, ఎవరో ఒకరికి ఆ వారానికి బెస్ట్ స్కిట్ అవార్డు ఇవ్వడం. టీవీ ఛానళ్లు మారినా.. ఈ స్టైల్ మాత్రం అలానే ఉంటూ వస్తోంది. అయితే తొలిసారిగా ఈ స్టయిల్‌ని బ్రేక్ చేసింది ‘ఆహా’. ఈ ఓటీటీలో ‘కామెడీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్’ పేరుతో ఓ షోను తీసుకొచ్చింది. ఇందులో షో చూడటానికి వచ్చిన ప్రేక్షకులే జడ్జిలు కావడం గమనార్హం.
కామెడీ షో + స్టాండప్ కామెడీలను కలిపి ‘కామెడీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్’ కార్యక్రమాన్ని రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ షో డిసెంబరు 2 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఈ షోకు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి చీఫ్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో వేణు, ముక్కు అవినాష్, సద్దాం, ఎక్స్ ప్రెస్ హరి, భాస్కర్, జ్ఞానేశ్వర్ కమెడియన్లుగా చేస్తున్నారు. వీళ్లు స్టాండప్ కామెడీ చేస్తూనే, స్కిట్లు కూడా వేస్తారు అని తెలుస్తోంది.
మొత్తంగా ఈ షో 10 ఎపిసోడ్‌ల పాటు ఉంటుంది. మొత్తం స్కిట్లు అయిపోయాక షో చూడటానికి లైవ్‌లో వచ్చిన ప్రేక్షకులు ఎవరి స్కిట్ బాగుంది అనే ఓటు వేస్తారు. దానికి తగ్గట్టుగా ఆ రోజు బెస్ట్ స్కిట్ అవార్డు ఇస్తారట. ముందుగా చెప్పినట్లు ఇలాంటి కాన్సెప్ట్ టీవీ కామెడీ షోస్‌లో లేదు. కాఫీ విత్ కరణ్ కొత్త సీజన్‌లో ర్యాపిడ్ ఫైర్‌కి ఇలాంటి ఆప్షన్ పెట్టారు. ఇప్పుడు మన దగ్గర చేస్తున్నారు.
గతంలో జబర్దస్త్ లాంటి షోస్‌లో జడ్జిలు కొంతమందికి ఫేవర్‌గా మార్కులు ఇస్తున్నారని విమర్శలు వచ్చేవి. అయితే అలాంటిదేం లేదు అని వాళ్లు చెప్పేవారు కూడా. అయితే ఇప్పుడు ఇలా ప్రేక్షకుల ఓటింగ్ వల్ల అలాంటి అపవాదు ఈ షోకు ఉండకపోవచ్చు అంటున్నారు. అయితే ఓటింగ్‌ను పర్‌ఫెక్ట్‌గా తీసుకుంటారా అనేది మనం చెప్పలేం.
ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!