నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వచ్చిన `అఖండ` చిత్రం విడుదలై 22 రోజులు పూర్తయినప్పటికీ ఇప్పటికీ మంచి కలెక్షన్లను నమోదు చేస్తూనే ఉంది.గతవారం ‘పుష్ప’ వంటి మరో పెద్ద సినిమా విడుదల అయినప్పటికీ ‘అఖండ’ జోరు తగ్గలేదు. ‘ద్వారకా క్రియేషన్స్’ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి.
దీంతో 8రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 22 రోజుల కలెక్షన్ల వివరాలను ఓసారి గమనిస్తే :
నైజాం
19.11 cr
సీడెడ్
14.52 cr
ఉత్తరాంధ్ర
5.98 cr
ఈస్ట్
4.01 cr
వెస్ట్
3.66 cr
గుంటూరు
4.57 cr
కృష్ణా
3.47 cr
నెల్లూరు
2.52 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
57.84 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
10.06 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
67.9 cr
‘అఖండ’ చిత్రానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 8 రోజులకే ఆ టార్గెట్ ను పూర్తిచేసిన ఈ చిత్రం 22 రోజులకి గాను రూ.67.9 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవరాల్ గా చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి రూ.13.9 కోట్ల లాభాలు దక్కాయి. నిన్న కూడా ఈ చిత్రం రూ.0.15 కోట్ల షేర్ ను రాబట్టింది.మరి 4 వ వారం కూడా అఖండ చిత్రం 200 కి పైగా థియేటర్లలో రన్ అవుతుండడం విశేషం.