Akhanda Movie: బాలయ్య ఫ్యాన్స్ కు పోలీసుల షాక్.. ఏమైందంటే?

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా చూసిన బాలయ్య ఫ్యాన్స్ మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఈ సినిమా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ బాగుందని అఘోరా పాత్రకు బాలయ్య పూర్తి స్థాయిలో న్యాయం చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. సింహా, లెజెండ్ సినిమాలను మించి అఖండ సక్సెస్ సాధించిందని అభిమానులు చెబుతున్నారు.

విదేశాలలో సైతం అఖండ మేనియా నడుస్తుండటం గమనార్హం. అయితే బాలయ్య అభిమానులు థియేటర్ లో చేసిన రచ్చకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆస్ట్రేలియాలోని ఒక థియేటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాలోని ఒక థియేటర్ లో బాలయ్య అభిమానులు రచ్చ చేయగా థియేటర్ యజమానులు మూవీని ఆపేసి వార్నింగ్ ఇచ్చారు. అయితే అభిమానులు మాత్రం మళ్లీ రచ్చ చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి షో ఆపేసి వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.

అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం బాలయ్య సినిమాలకు ఈ మాత్రం రచ్చ లేకపోతే ఎలా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు యూఎస్ఏ లో అఖండ మూవీ ప్రదర్శిస్తున్న సినీమార్క్ థియేటర్ లో థియేటర్ సౌండ్స్ ను నిర్దిష్ట డెసిబుల్స్ కు పరిమితం చేశామని, ఏది ఏమైనా సౌండ్ మాత్రం పెరగదని నోటీస్ పెట్టారు. యూఎస్ఏలో ఒక తెలుగు మూవీకి ఈ విధంగా నోటీస్ పెట్టడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. అఖండ సినిమాకు థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus