నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రం `అఖండ`. గతంలో వీరి కంబినేషన్లో ‘సింహా’ ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు రావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ‘ద్వారకా క్రియేషన్స్’ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణకి జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండడం విశేషం.ఇక అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత మిర్యాల రవిందర్ రెడ్డి మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.
నిజానికి ఈ చిత్రానికి ముందుగా ‘మహార్జాతకుడు’ అనే టైటిల్ ను అనుకున్నారట. మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ… “ఏ సినిమాకైనా కథే ముందు కదా. ఆ తరువాతే స్టార్ హీరో అయినా… స్టార్ డైరెక్టర్ అయినా.! పెద్ద హీరోలకు కథ అనేది లైన్‌గా ఉన్నా పర్లేదు.మిగతా భారాన్ని వాళ్ళే మోస్తారు. ఆ హీరో అభిమానులు ఆ కథని ముందుకు తీసుకెళ్తారు. బాలకృష్ణ గారి 100వ సినిమాని బోయపాటి గారు చేయాలి. ‘లెజెండ్’ వచ్చిన 2014 వ సంవత్సరంలోనే ‘మహర్జాతకుడు’ టైటిల్‌తో బాలకృష్ణ గారికి ఈ చిత్రం కథ చెప్పారు బోయపాటి గారు.
అప్పుడే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాం. అన్నీ కుదిరాయి. ‘ద్వారకా క్రియేషన్స్’, రవీందర్ రెడ్డిగారితో చేద్దామని బాలకృష్ణ గారితో బోయపాటి గారు అన్నారు. అఖండ అంటే అనంతం.. కాదనలేని సత్యం. సినిమా చూశాక.. ఆ టైటిల్ ఎందుకు మార్చామనేది మీకు తెలుస్తుంది. కథకు ఈ టైటిల్ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది.అఘోరాలు అంటే సమాజానికి సంబంధం లేని వ్యక్తులు కాదు. వారు వ్యక్తుల కన్నా.. దైవం, ప్రకృతి వాటి పై రియాక్ట్ అవుతుంటారు. అలాంటి క్యారెక్టర్ రావడం, సమస్యలను పరిష్కరించడమనేది మిగిలిన కథ” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.