అక్కినేని ఫ్యామిలీ యంగ్ హీరో అఖిల్ (Akhil Akkineni) ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో ఒక కీలక అడుగు వేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు కెరీర్‌పై మాత్రమే ఫోకస్ చేసిన అఖిల్, మొదటిసారి తన ప్రేమ విషయంలో ఓపెన్ అయ్యాడు. ఇటీవల జైనాబ్ రవ్జీతో అతడి ఎంగేజ్మెంట్ జరిగినట్టు సమాచారం, ఇప్పుడు ఆ ప్రేమ మరింత లోతుగా మారిందని తెలుస్తోంది. తాజాగా బీచ్‌లో దిగిన ఫోటోతో ఇది మరోసారి నిరూపితమైంది. “నా సర్వస్వం” అనే క్యాప్షన్‌తో అఖిల్ షేర్ చేసిన బీచ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జైనాబ్‌తో కలిసి ఒకేలా కాస్ట్యూమ్ ధరించి, హగ్ చేస్తూ కనిపించిన ఈ జంట పిక్ ఎంతో ఎమోషనల్‌గా ఉంది. ప్రేమలో ఉన్న వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ స్పష్టంగా కనిపించడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. “ఇలాంటి పిక్‌లతోనైనా నిజమైన ప్రేమను విశ్వసించగలుగుతున్నాం” అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరూ తరచూ బహిరంగంగా కనిపించడమే కాదు, అఖిల్ ఫ్యామిలీతో కూడా జైనాబ్ బాగా కలిసిపోయిందని టాక్.
పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందన్న ప్రచారం కూడా బలపడుతోంది. ప్రత్యేకంగా అఖిల్ (Akhil) ఇలా ప్రేమ పిక్‌ను పబ్లిక్‌గా షేర్ చేయడం చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అఖిల్ ఎమోషనల్ వెర్షన్ ఇంతవరకూ ఎవరూ చూడలేదని అంటున్నారు. ఇక ప్రొఫెషనల్ పరంగా చూస్తే.. ‘ఏజెంట్’ (Agent) డిజాస్టర్ అయ్యాక, అఖిల్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు మళ్లీ ‘లెనిన్’ (Lenin) అనే టైటిల్‌తో ఓ డిఫరెంట్ కథపై పని చేస్తున్నాడు.
‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) ఫేమ్ మురళీ కిషోర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి గ్రామీణ నేపథ్యంలో సెట్ చేస్తుండగా, శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటించనుంది. ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో పాజిటివ్ ఫేజ్‌లో ఉన్న అఖిల్.. అదే ఫోకస్‌తో ప్రొఫెషనల్‌గా కూడా బలంగా మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడని అభిమానులు నమ్ముతున్నారు.