Akira Nandan, Pawan Kalyan: అఖీరా టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్… ఫ్యాన్స్ కు గూజ్ బంప్స్ తెప్పించే న్యూస్..!
- October 26, 2021 / 07:18 PM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంది లాయల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలకు హిట్, ఫ్లాప్ టాక్ లతో సంబంధం ఉండదు. ఎలా ఉన్నా వసూళ్ళ పరంగా దూసుకుపోతుంటాయి.ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న పవన్ కళ్యాణ్.. మరో పక్క రాజకీయాల్లో కూడా బిజీగా గడుపుతున్నారు. ఆయన పార్టీ బలోపేతం అయితే… ఆయనకి బాధ్యతలు మరింత పెరుగుతాయి. పైగా ఆయన వయసు కూడా 50ఏళ్ళకు వచ్చేసింది. దాంతో పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ ను హీరోగా ఎప్పుడు లాంచ్ చేస్తారా?
అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అఖీరా ఎక్కడ కనిపించినా అభిమానులు మురిసిపోతున్నారు.6 అడుగులు పైనే హైట్ ఉన్న అఖీరా గ్లామర్ విషయంలో కూడా తండ్రికి ఏమాత్రం తీసిపోడు. అయితే అఖీరా సినీ రంగ ప్రవేశం గురించి తల్లి రేణు దేశాయ్ ఎప్పుడూ నోరు మెదపలేదు.పవన్ కూడా ముసిముసి నవ్వులు నవ్వేస్తూ దాటేశాడు కానీ అభిమానులకి కావాల్సిన ఆన్సర్ మాత్రం ఇవ్వలేదు. అయితే ఓ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు ఫిలింనగర్ ను కూడా ఓ ఊపు ఊపేస్తోంది.

అదేంటి అంటే.. క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో అకిరా నటిస్తున్నాడట. అందుకోసమే అతను కర్ర సాము కూడా నేర్చుకున్నట్టు ఇండస్ట్రీ టాక్. అంతేకాదు సంగీతం టీచర్ ను కూడా పెట్టుకుని అతను సాధన చేస్తుండడాన్ని బట్టి చూస్తే ఈ వార్త నిజమే అనిపిస్తుంది. అయితే అధికారిక ప్రకటన వస్తే కానీ కచ్చితంగా చెప్పలేము.
నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?

















