భీమినేని శ్రీనివాసరావు దర్శకుడిగా అవతరించి ఇరవై సంవత్సారాలు దాటినా స్టార్ దర్శకుడిగాను మారలేదు, అలా అని సినిమాలు తీయడమూ మానలేదు. ఈ ఇరవై ఏళ్ళలో ఆయన 11 సినిమాలు చేస్తే అందులో 9 అక్కడా, ఇక్కడా అరువు తెచ్చుకున్న కథలే. రీమేక్ హీరోగా వెంకీని ఎలా చెప్పుకుంటారో అలా ఈయన్ని రీమేక్ డైరెక్టర్ గా చెప్పుకోవచ్చు. కెరీర్ ఆరంభంలో మంచి విజయాలు అందుకున్న భీమినేని తర్వాత ఆ ఫలితాన్ని పొందలేకపోతున్నారు. 1998లో ఒకే ఏడాది మూడు సినిమాలు చేసిన ఈయన తర్వాత మూడేళ్లకో సినిమా ఆరేళ్లకో సినిమా అన్నట్టు బండి నెట్టుకొస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే….
ఈ ఏడాది ఆరంభంలో బెల్లంకొండ శ్రీనివాస్ ని ‘స్పీడున్నోడు’గా తెరమీదికి తీసుకొచ్చిన భీమినేని అల్లరి నరేశ్ తో మరో సినిమా చేయనున్నారట. గతంలో వీరిద్దరి కలయికలో ‘సుడిగాడు’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇరువురి మధ్యా చర్చలు కూడా జరిగాయటయట. అయితే అల్లరి మెడ లోని మినిమమ్ గ్యారెంటీ హీరో ట్యాగ్ పోయి ఏళ్ళు కావస్తోంది. దాంతో ఓ హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అల్లరోడు ప్రస్తుతం ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు. భీమినేని సైతం సూచన పూర్వకంగా అంగీకారం తెలిపాడట. అయితే ‘సుడిగాడు’ సహా భీమినేని సినిమాల మాదిరి ఇది రీమేక్ సినిమానేనా కాదా అన్నది తేలాల్సి ఉంది.