ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారారు. పుష్ప 2 (Pushpa 2) షూటింగ్ దశలో ఉండగానే, ఆయన తదుపరి సినిమాలపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. బన్నీ తన తదుపరి ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో (Trivikram) చేయబోతున్నాడనే టాక్ కూడా బలంగా వినిపించింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోందని.. మైథలాజికల్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో బన్నీ కొత్త లుక్ లో కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి.
అయితే, ఈ సినిమా ఇంకా అధికారికంగా లాంచ్ అవ్వకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం, ఆలస్యానికి ప్రధాన కారణం బడ్జెట్ అని తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమా మాత్రమే కాదు, బన్నీ అట్లీ (Atlee Kumar) కాంబినేషన్ లో చేయబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా ఆర్థిక సమస్యల వల్ల నిలిచిపోయిందని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. పుష్ప 2 కోసం బన్నీ ఏకంగా 250 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నాడట.
అలాగే, అట్లీ కూడా తన స్థాయిని దృష్టిలో ఉంచుకుని 100 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నాడట. కేవలం హీరో, దర్శకుడి రెమ్యునరేషన్‌కే 350 కోట్ల బడ్జెట్ కేటాయించాల్సిన పరిస్థితి. ఈ భారీ ఖర్చును నిర్మాతలు లెక్కలేసుకుంటూ ముందుకెళ్లడం ఆపేశారట. సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి సిద్దం అయినా, బడ్జెట్ లెక్కల కారణంగా ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఒకవేళ ఈ సినిమా మొదలవుతే, మొత్తం బడ్జెట్ 600 కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి.
ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణం ఆపితే బన్నీకి త్రివిక్రమ్ సినిమా కంటే ముందుగా మరో సినిమా చేసే ఆలోచన కూడా ఉందని టాక్. మొత్తం మీద, బన్నీ లైనప్ లో ఆలస్యం పూర్తిగా బడ్జెట్ వల్లనే అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఏ ప్రాజెక్ట్ మొదట ప్రారంభమవుతుందో అనేది త్వరలోనే తెలుస్తుంది. కానీ ఫ్యాన్స్ మాత్రం బన్నీ నుంచి అధికారిక ప్రకటన కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.