టాలీవుడ్ సినిమా ప్రపంచ స్థాయికి చేరింది. కొత్త దర్శకులు హీరోలు మన సినిమా గౌరవాన్ని పెంచేస్తున్నారు. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలు సైతం ప్రయోగాత్మక చిత్రాలలో నటించడానికి ఇష్టపడుతున్నారు. ఇక హీరోలు దర్శకులు వారికి నిర్ధేశించిన పాత్ర కోసం అందులో పర్ఫెక్షన్ కోసం తాపత్రయ పడుతున్నారు. పాత్రకు కావలసిన శరీరం కోసం మరియు మాట తీరు మరియు మాండలికాలను అవపోసన పడుతున్నారు.
ఎన్టీఆర్ గత చిత్రం అరవింద సమేత వీర రాఘవ సినిమా పాత్ర కోసం ఎన్టీఆర్ కంప్లీట్ మేక్ ఓవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ డెవలప్ చేయడంతో పాటు, రాయలసీమ మాండలికం నేర్చుకున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ కుటుంబానికి చెందిన యువకుడి పాత్ర చేసిన ఎన్టీఆర్ రాయలసీమ యాస కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. రచయిత పెంచల్ దాస్ ఎన్టీఆర్ కి రాయలసీమ డిక్షన్ ఖచ్చితంగా పలకడానికి శిక్షణ ఇచ్చారు. అలాగే బన్నీ సైతం రాయలసీమ డిక్షన్ కొరకు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. దర్శకుడు సుకుమార్ ఓ నిపుణుడిని బన్నీకి రాయలసీమ మాండలికంలో శిక్షణ ఇవ్వడానికి తీసుకున్నారు. చిత్తూరు మాస్ రాయలసీమ పోరగాళ్ళు మాట్లాడే నాటు భాషను బన్నీకి అతను నేర్పుతున్నాడట. తాము చేసే పాత్ర మరియు ప్రాంతానికి తగ్గట్టుగా డైలాగ్ డెలివరీలో మన హీరోలు పర్ఫెక్షన్ కొరకు తాపత్రయ పడుతున్నారు.