సినీ పరిశ్రమని విషాదాలు వీడటం లేదు. నిత్యం ఎవరోక సెలబ్రిటీ, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మరణిస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ హీరోయిన్ ఇంట్లో విషాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఆ హీరోయిన్ మరెవరో కాదు భాను శ్రీ మెహ్రా (Bhanu Sri Mehra). గతంలో అల్లు అర్జున్ ((Allu Arjun) – గుణశేఖర్ (Gunasekhar) కాంబినేషన్లో తెరకెక్కిన ‘వరుడు’ (Varudu) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాని తర్వాత ఈమె ‘గోవిందుడు అందరి వాడేలే’ (Govindudu Andarivadele) ‘అలా ఎలా?’ ‘మిస్ ఇండియా’ సినిమాల్లో నటించింది.
Allu Arjun
హీరోయిన్ గా సరైన బ్రేక్ రాకపోవడంతో వెంటనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. అయినప్పటికీ ఈమెకు ఆఫర్లు రావడం లేదు. ఇదిలా ఉండగా.. ఈమె ఇంట్లో విషాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది భాను శ్రీ మెహ్రా భాను శ్రీ మెహ్రా పోస్టుని గమనిస్తే ఆమె సోదరుడు నందు మరణించి 7 రోజులు అవుతుంది అని స్పష్టమవుతుంది. “అనారోగ్య సమస్యలతో నా సోదరుడు నందు నాకు దూరమయ్యాడు.
నందు… నువ్వు చనిపోయి 7 రోజులైంది. అది ఒక పీడ కల అయితే బాగుండేది. నిజమంటే నమ్మడానికి మనసుకి చాలా కష్టంగా ఉంది. నువ్వు లేకపోవడంతో ఫ్యామిలీలో ఓ భయంకరమైన సైలెన్స్ ఏర్పడింది.ప్రతి చిన్న విషయానికి నిన్ను గుర్తుచేసుకుంటూనే ఉన్నాం.’నువ్వు లేవు’ అనే బాధ మేము జీవితాంతం మోయాలా? నా మనసులో నీ స్థానం ఎప్పటికీ మారదు. ఐ లవ్ యు.. ఐ మిస్ యు నందు” ఎమోషనల్ గా రాసుకొచ్చింది భాను శ్రీ మెహ్రా.