టాలీవుడ్ టాప్ హీరో ఎవరు అంటే….ప్రతీ హీరో అభిమాని మా హీరోనే టాలీవుడ్ టాప్ హీరో అంటూ జబ్బలు చరుచుకుంటారు. అయితే ఏ లెక్కల ప్రకారం చెబుతారు అని అడిగితే, కొందరు రికార్డ్స్ బట్టి అని చెప్పగా..మరికొందరు హిట్స్ బట్టి చెబుతూ ఉంటారు. ఇదంతా అభిమానులు వారి వారి హీరోలపై తమకు ఉన్న అభిమానంతో చెప్పే లెక్కలు. కానీ ఒక హీరో పొజిషన్ డిసైడ్ చెయ్యాలి అంటే ఆ హీరో సినిమాకు వచ్చే కలెక్షన్స్ చాలా కీలకం అనే చెప్పాలి.
విషయం ఏమిటంటే…స్టైలిష్ స్టార్ బన్నీ ఈ మధ్య ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా వరుసగా మూడు బన్నీ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద 50కోట్ల మార్క్ ను అందుకున్నాయి. అయితే మార్కెట్ విషయంలో పవన్ మరియు మహేష్ ఇద్దరూ టాప్ రెండు స్థానాల్లో ఉంటే, తాజా లెక్కల ప్రకారం బన్నీ వారి తరువాత మూడో స్థానంలో ఉన్నాడు అనేది లెక్కలు చెబుతున్న సత్యం.
ఇంతకీ ఏంటి ఆ లెక్కలు అంటారా…తాజాగా బన్నీ నటిస్తున్న సరైనోడు సినిమా మార్కెట్ విషయమే తీసుకుంటే….ఈ చిత్రం బిజినెస్ సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహోత్సవం సినిమాలకు దగ్గరగా ఉండటం.. కొన్ని ఏరియాల్లో వాటిని దాటేస్తుండటం చూస్తుంటే బన్నీ సత్తా ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా మిగిలిన యువ హీరోలు…ప్రభాస్ – ఎన్టీఆర్ సైతం మార్కెట్ విషయంలో మూడో స్థానానికి పోటీ పడుతున్నప్పటికీ…బన్నీతో పోలిస్తే కొన్ని విషయాల్లో వాళ్ళు కాస్త వెనుక పడినట్లు టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వస్తున్న వాదన. ఇక సరైనోడు సంచలనం సృష్టిస్తే…మాత్రం బన్నీ టాప్ 2గా అవతరించే అవకాశం సైతం లేకపోలేదు.