Allu Arjun: నిఖిల్ 18 పేజస్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బన్నీ!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా యంగ్ హీరో నిఖిల్ నటించిన 18 పేజస్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో జిఏ2 పిక్చర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థలు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఈ సినిమాలో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీ విడుదల కానుంది. నిఖిల్ అనుపమ కాంబినేషన్లో వచ్చిన కార్తికేయ 2 ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్నటువంటి 18 పేజెస్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఈవెంట్లో భాగంగా అల్లు అర్జున్ సినిమా గురించి మాట్లాడుతూ పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ సినిమా నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా అంటూ చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఈ సినిమాను నాకు ఎంతో ఇష్టమైన సుకుమార్ నిర్మించారు.

ఈ సినిమా చూసిన తర్వాత సుకుమార్ నిర్మాణంలో తాను కూడా ఒక సినిమా చేయాలని అనుకున్నాను అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ తెలియజేశారు. ఇక డైరెక్టర్ సూర్య ప్రతాప్ గత నాలుగు సంవత్సరాలుగా ఒక తపనతో ఈ సినిమాని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారని తెలిపారు. ఇక నిఖిల్ నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. తనని హ్యాపీ డేస్ సినిమా నుంచి చూస్తూ వస్తున్నాను.ఎంతో మంచి కథలను ఎంపిక చేసుకొని ముందుకు దూసుకు వెళ్తున్నాడు.

ఈ సినిమా ద్వారా కూడా మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus