మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ వరకు నేషనల్ అవార్డ్ అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అటువంటి అచీవ్మెంట్ ను మన తెలుగు ఇండస్ట్రీలో 69 ఏళ్లపాటు ఎవరూ సాధించలేకపోగా.. 70వ ఏడాది అల్లు అర్జున్ “పుష్ప” (Pushpa) కమర్షియల్ సినిమాతో నేషనల్ అవార్డ్ కొట్టిన మొట్టమొదటి హీరోగా సరికొత్త రికార్డ్ సృష్టించాడు. అల్లు అర్జున్ కి (Allu Arjun) అవార్డ్ ఇవ్వడం కంటే.. “పుష్ప” సినిమాలోని పాత్రకు ఇవ్వడం పట్ల భిన్న స్వరాలు వినిపించాయి. అయితే.. అవన్నీ “పుష్ప 2”లో (Pushpa 2: The Rule) బన్నీ పెర్ఫార్మెన్స్ చూసాక తారుమారైపోయి.
Allu Arjun
ముఖ్యంగా జాతర ఎపిసోడ్ లో బన్నీ పడిన కష్టం, క్లైమాక్స్ లో ఎమోషనల్ గా కింద కూర్చుంటూ కన్నీళ్లు పెట్టుకునే సీన్ చూసిన ప్రతి ఒక్కరూ అప్పుడు కాదు ఇప్పుడు ఇవ్వాలి నేషనల్ అవార్డ్ అంటున్నారు. అయితే.. ఒకే పాత్రకి రెండోసారి నేషనల్ అవార్డ్ ఇవ్వడం అనేది కష్టం కాబట్టి, నేషనల్ అవార్డ్ కి మించిన అవార్డ్ ఇండియాలో లేదు కాబట్టి, బన్నీకి ప్రేక్షకులు, విశ్లేషకులు పలుకుతున్న జేజేలే పెద్ద అవార్డ్ అని భావించాలి.
ఏదేమైనా.. నాలుగేళ్లపాటు బన్నీ పడిన శ్రమకు పార్ట్ 1తో మిశ్రమ స్పందన వచ్చినా “పార్ట్ 2” మాత్రం సరైన న్యాయం చేసింది. ఇకపోతే.. అల్లు అర్జున్ తదుపరి సినిమా ఎనౌన్స్మెంట్ జనవరిలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో బన్నీ నటించబోయే ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ సినిమా అవుతుంది.
ఒక రకంగా త్రివిక్రమ్ ను ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ కు పరిచయం చేయబోయేది బన్నీ అన్నమాట. చిన్నపాటి మైథలాజికల్ టచ్ ఉండే ఈ చిత్రాన్ని సితార & గీతా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తాయని వినికిడి. ఇక హీరోయిన్ ఎవరు? కీలకమైన టెక్నీషియన్లు ఎవరు అనేది జనవరిలో విడుదల చేయబోయే అనౌన్స్మెంట్ టీజర్ తోనే తెలుస్తుంది.