టాలీవుడ్ టాప్ ఫ్యామిలీస్ లో ఒకటైన మెగా ఫ్యామిలీకి కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టిన రోజు వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించారు అభిమానులు. అభిమానుల కోలాహాలం మధ్యన మురిసిపోతూ…మెరిసిపోయింది మెగా ఫ్యామిలీ. ఆయితే అక్కడకు వచ్చిన వారంతా మెగా ఫ్యామిలీని ఒక్క స్టేజ్ పై చూసి ఆనందంతో ఊగిపోయారు. ఇక ఇదే క్రమంలో ఎవరికి వారు మెగా స్టార్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. అదే విధంగా బన్నీ టర్న్ రాగానే బన్నీ అందుకున్నాడు. ఎప్పటిలాగనేర్ సింపల్ గా రెండు మూడు వాఖ్యాల్లో మ్యాటర్ తేల్చెసాడు.
ఇంతకీ బన్నీ ఏం మాట్లాడాడు అంటే…’స్టార్ స్టార్ మెగాస్టార్.. బాస్ ఈజ్ బ్యాక్” అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టి మెగా స్టార్ ను తనదైన శైలిలో పోగుడుతూ….”ఏ హీరోకు ఫ్యాన్స్ ఇంత పెద్ద రేంజులో ఫంక్షన్ చేసే స్టారే ఉండరు. ఆ అదృష్టం మెగాస్టార్ ఒక్కరికే ఉంది. అందుకే ఆయన తరుపును నేను కృతజ్ఞతలను చెబుతున్నాను” అని వెనువెంటనే….. కేవలం ఒకే ఒక్క మాట చెప్పేసి వెళిపోతానంటూ ఒక డైలాగ్ చెప్పాడు. ”బొట్టు పెట్టుకోని హిందువుని.. టోపీ వెయ్యని ముస్లింని.. శిలువ వేసుకోని క్రైస్తవుడిని.. టోటల్ గా ఈ పేటకు మేస్ర్తిని” అంటూ అప్పుడెప్పుడో మెగాస్టార్ చిరంజీవి ”ముఠామేస్ర్తి” సినిమాలో చెప్పిన డైలాగ్ చెప్పాడు బన్నీ. ఇక ఈ డైలాగ్ అయిహ వెంటనే అభిమానులు ఈలలతో, గోలచేస్తూ ఆడిటోరియం అంతటా….హంగామా చేశారు.