‘పుష్ప 2’ (Pushpa 2) తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో ఒక సినిమా రావాలి. కానీ అది ఆలస్యమయ్యేలా ఉండటంతో అట్లీకి (Atlee Kumar) ఛాన్స్ ఇచ్చాడు బన్నీ. అతి త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది అని సమాచారం.దీని ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ దుబాయ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే 2,3 సార్లు అల్లు అర్జున్ దుబాయ్ వెళ్లొచ్చారు. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. కొద్దిరోజుల్లో తిరిగి ఇండియాకు తిరిగి వస్తారు అని వినికిడి.
ఆ తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం రూ.250 కోట్లు పారితోషికం అందుకోబోతున్నారు అని ప్రచారం జరిగింది. దర్శకుడు అట్లీ కూడా రూ.100 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో బన్నీ డబుల్ రోల్ చేస్తారని ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. ఆ రెండు పాత్రల్లో ఒకటి పాజిటివ్ రోల్.. ఇంకోటి పూర్తిగా నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందట.
అలా అని అది విలన్ టైపు రోల్ కాదట. కానీ ఇందులో ఆ నెగిటివ్ రోల్ కి మించి ప్రతినాయకుడు ఉండదు అని తెలుస్తుంది. అట్లీ సినిమాల్లో హీరోలు దాదాపు డబుల్ రోల్స్ చేస్తుంటారు. ‘మెర్సల్’ (Mersal) ‘బిగిల్’ (Bigil) ‘జవాన్’ (Jawan) వంటి సినిమాల్లో హీరోలు డబుల్ రోల్స్ చేశారు. అయితే అల్లు అర్జున్ కి మాత్రం డబుల్ రోల్ చేయడం అనేది.. కెరీర్లో మొదటిసారి అవుతుంది.