Allu Arjun, Pawan Kalyan: పవన్ కి బన్నీ బర్త్ డే విషెస్.. ఫ్యాన్స్ ని కూల్ చేసే ప్రయత్నమా?
- September 2, 2024 / 05:02 PM ISTByFilmy Focus
ఈరోజు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు.2024 ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాదించడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగానే కాకుండా కొన్ని కీలక మంత్రిత్వ శాఖలు స్వీకరించడం వల్ల.. ఈ బర్త్ డే అభిమానులకి ప్రత్యేకంగా నిలిచింది. ఇక పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రిటీలు ట్వీట్లు, పోస్టులు వంటివి చేస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ (Allu Arjun) ట్వీట్ కొంచెం ప్రత్యేకతను సంతరించుకుంది.
Allu Arjun, Pawan Kalyan

ఎందుకో ఈపాటికే అందరికీ అర్ధమై ఉండొచ్చు.ఎన్నికల టైంలో అల్లు అర్జున్.. జనసేన పార్టీని పక్కనపెట్టి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్పా రవి తరఫున ప్రచారం చేసి వచ్చాడు.ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, జనసేన శ్రేణులకు.. అంతెందుకు మెగా ఫ్యామిలీకి కూడా అస్సలు నచ్చలేదు. తర్వాత నాగబాబు.. పరోక్షంగా అల్లు అర్జున్ పై మండిపడుతూ ఓ ట్వీట్ వేయడం.. ఆ తర్వాత జరిగిన సంగతులు కూడా అందరికీ తెలిసిందే.

ఇలాంటి పరిస్థితుల్లో.. ‘పుష్ప 2’ (Pushpa 2) కనుక రిలీజ్ అయ్యి ఉండుంటే.. కచ్చితంగా ఈ నెగిటివిటీలో ఆ సినిమా ఫలితం తేడా కొట్టేసేడేమో. కానీ టైం బాగుండి ఆ సినిమా రిలీజ్ కాలేదు. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈ మధ్యనే మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం (Maruthi Nagar Subramanyam) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లిన అల్లు అర్జున్..’నాకు ఇష్టమైతే నేను వస్తాను’ అంటూ పవన్ ఫ్యాన్స్ కి మండేలా మాట్లాడాడు. ఇది జనసేన ఎమ్మెల్యేలను సైతం కదిలించింది. ‘మెగా ఫ్యాన్స్ లేకపోతే నువ్వెంత?’ అంటూ అల్లు అర్జున్ పై నేరుగానే విమర్శలు చేశారు.

మరోపక్క కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు సైతం.. ‘అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ వచ్చినా మేము నటించం’ అంటూ చెప్పడం మరింత హాట్ టాపిక్ అయ్యింది.మరీ ఇంత నెగిటివిటీ ఎందుకులే అనుకున్నాడో ఏమో.. కానీ ఈరోజు పవన్ కి బర్త్ డే విషెస్ చెప్పాడు అల్లు అర్జున్. ‘మెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే టు పవర్ స్టార్ అండ్ డీసీఎం(డిప్యూటీ సీఎం) పవన్ కళ్యాణ్ గారు’ అంటూ అతను ట్వీట్ చేయడం జరిగింది. బన్నీ కొంచెం తగ్గాడు.. ఇక పవన్ ఫ్యాన్స్, జనసేన శ్రేణులు.. కూల్ అవుతారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
Many happy returns of the day to Power Star & DCM @PawanKalyan garu
— Allu Arjun (@alluarjun) September 2, 2024
















