Kenishaa Francis: రూమర్స్ పై స్పందించిన జయం రవి పార్టనర్!
- June 10, 2025 / 02:09 PM ISTByDheeraj Babu
గత కొన్ని రోజులుగా ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉంటూ వస్తున్నాడు జయం రవి. మొదట భార్యతో విడాకులను ఎనౌన్స్ చేసి చిన్న షాక్ ఇవ్వగా, ఆ డివోర్స్ న్యూస్ ను ఖండిస్తూ అతడి ఎక్స్ వైఫ్ ఆర్తి పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత అతడి నుంచి నెలకి 40 లక్షల ఆలిమోని ఆశిస్తూ కేస్ పెట్టి మరో సంచలనం సృష్టించింది. ఈ హడావుడి మొత్తాన్ని ప్రియురాలితో పెళ్లికి అటెండ్ అయ్యి తనవైపుకి డైవర్ట్ చేసుకున్నాడు జయం రవి.
Kenishaa Francis

ఇప్పుడు జయం రవి (Jayam Ravi) భార్యతో వేరైపోవడమే కాకుండా, ప్రియురాలు కనీహాతో కలిసే ఉంటున్నాడు. కట్ చేస్తే.. జయం రవి ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ కనీషా (Kenishaa Francis) ప్రెగ్నెంట్ అనే వార్త హల్ చల్ చేసింది. అందుకే జయం రవి అతడి భార్యకి విడాకులు ఇచ్చాడని, లేకపోతే ఉన్నపళంగా 15 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తిపలకడానికి కారణం ఏంటని సోషల్ మీడియా మొత్తం కనీషా మీద దుమ్మెత్తిపోసింది.

అయితే.. ఈ విషయమై కనీషా (Kenishaa Francis) కాస్త ఘాటుగానే స్పందించింది. నేను జయం రవితో కలిసి ఉంటున్నాను అనేది వాస్తవమే అయినప్పటికీ.. నేను ప్రెగ్నెంట్ అనేది మాత్రం అవాస్తవం అని క్లారిటీ ఇచ్చింది కనీషా. ఈ రూమర్ ఎవరు స్ప్రెడ్ చేసారో తనకు తెలుసునని, వాళ్లని వదిలే ప్రసక్తి లేదని చెప్పుకొచ్చింది కనీషా.

ఇకపోతే.. జయం రవి ఇప్పుడు నిర్మాతగా మారాడు. తాను హీరోగా తెరకెక్కే తదుపరి చిత్రం “బ్రో కోడ్”ను తానే నిర్మిస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. అయితే.. జయం రవి & ఆర్తి మధ్య లీగల్ వార్ అనేది నడుస్తూనే ఉంది. ముఖ్యంగా ఆలిమోనీ విషయంలో కోర్ట్ ఎలా స్పందిస్తుంది అనేది కూడా చర్చనీయాంశం. ఈ విషయం ఎప్పటికీ ఒక కొలిక్కి వస్తుందా అని కోలీవుడ్ జనాలు ఎదురుచూస్తున్నారు.













