తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి జెనరేషన్ ఆడియన్స్ కి చిరు రేంజ్ తెలీడం లేదేమో కానీ.. ఒకప్పుడు ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం ఏర్పడేది. మార్నింగ్ షోలు, బెనిఫిట్ షోల కోసం ప్రేక్షకులు టికెట్ల కోసం థియేటర్ల వద్ద జాగారాలు చేసేవారు. వర్షం, వచ్చినా వరదలు వచ్చినా చిరు సినిమాలు మిస్ అయ్యేవారు కాదు.
అందుకు బెస్ట్ ఎగ్జామ్పుల్ గా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) గురించి చెప్పుకోవచ్చు. మే 9, 1990న ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు రోజు నుండి భారీ వర్షాలు. తెలుగు రాష్ట్రాలు మొత్తం జలమయమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతలు తమ సినిమాని రిలీజ్ చేసుకోవడానికి సంకోచిస్తారు. కానీ అశ్వినీదత్ (C. Aswani Dutt) అలా కాదు.
ఆయన గట్స్, ఆయన విజన్ అలాంటివి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాని రిలీజ్ చేశారు. ఈ సినిమా అప్పటివరకు వేరే సినిమాల పేరుతో అన్న రికార్డులు అన్నిటినీ తిరగరాసింది అని చెప్పాలి.ఈ సినిమా క్రియేట్ చేసిన ఓ యార్డుదైనా రికార్డు గురించి చెప్పాలి అంటే.. రిలీజ్ రోజున భయంకరమైన వర్షాల్లో కూడా కొన్ని ఏరియాల్లో రూ.6.50 ఉన్న టికెట్ రేటుని రూ. 210 కి అమ్మారట.
అంటే దాదాపు 35 రెట్లు అన్నమాట. ఇప్పుడు సింగిల్ థియేటర్స్ లో ఒక్కో టికెట్ ధర రూ.175 గా ఉంది. మరి ఈ టికెట్ రేట్ల ప్రకారం చూసుకుంటే.. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ టికెట్ రేటు వేలల్లో ఉంటుంది. అప్పుడే డే 1 కలెక్షన్లు వెయ్యి కోట్లు రిజిస్టర్ అయ్యేవేమో