2016లో మలయాళంలో విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న చిత్రాల్లో “ఆనందం” ఒకటి. ప్యూర్ కాలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువదించారు. నివిన్ పౌలీ అతిధి పాత్ర పోషించిన ఈ చిత్రం నేడు (మార్చి 23) విడుదలైంది. మరి ఈ అనువాద చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారో చూద్దాం..!!
కథ : అక్షయ్, రాంకీ, గౌతమ్, వరుణ్ (అరుణ్, తోమస్, రోషన్, సిద్ధి) ఇంజనీరింగ్ స్టూడెంట్స్. హ్యాపీ కాలేజ్ లైఫ్, కాలేజ్ లోనే గర్ల్ ఫ్రెండ్, క్రికెట్, కంప్యూటర్స్ తో ఎంజాయ్ చేస్తుంటారు. ఇండస్ట్రియల్ టూర్ కోసం గ్రూప్ మెంబర్స్ మొత్తం భారీ ప్లానింగ్ చేస్తారు. హంపి మీదుగా గోవా వెళ్ళి అక్కడ న్యూ ఇయర్ పార్టీ ఎంజాయ్ చేయాలనేది లక్ష్యంగా బయలుదేరిన గ్రూప్ అందరికీ ఈ ప్రయాణం ఎన్నో కొత్త పాఠాలను నేర్పుతుంది. ప్రయాణం ముగిసేలోపు ఎవరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి అనేది “ఆనందం” సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు : మాములుగా అందరూ కొత్తవారు ఉండడం సినిమాలకి మైనస్ అవుతుంటుంది. కానీ.. “ఆనందం” సినిమాకి అదే ప్లస్ పాయింట్ అయ్యింది. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కొత్తవాళ్లే అవ్వడం, వాళ్ళు నటించడం కోసం ప్రత్నించకుండా.. కుదిరినంత వరకూ సహజంగా బిహేవ్ చేశారు. అందువల్ల సినిమా చూస్తున్నప్పుడు ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది.
సాంకేతికవర్గం పనితీరు : సచిన్ వారియర్ సంగీతం ఉల్లాసపరుస్తుంది. ఆనంద్ సి.చంద్రన్ సినిమాటోగ్రఫీ వల్ల హంపి, గోవా మరింత అందంగా కనిపించాయి. అందువల్ల సినిమా చూస్తున్నప్పుడు మంచి ఫీల్ కలుగుతుంది. దర్శకుడు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కోసం రాసుకున్న సన్నివేశాలు, పండించిన ఎమోషన్స్ అందరికీ బాగా కనెక్ట్ అవుతాయి. కాకపోతే.. తెలుగు డబ్బింగ్ వాయిస్ ల విషయంలో కనీస స్థాయి జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన క్యారెక్టర్స్ జనాలకి కనెక్ట్ అవ్వవు. అందువల్ల సినిమా విజువల్ గా సినిమా ఎంతబాగున్నా… కంటెంట్ పరంగా సింక్ అవ్వలేరు.
విశ్లేషణ : ప్లేట్ నీట్ గా లేనప్పుడు.. అందులో రుచికరమైన భోజనం ఉన్నా తినలేం. “ఆనందం” సినిమా కూడా అలాంటిదే అందమైన కాన్వాస్ మీద అర్ధంకాని బొమ్మ వేసినట్లుగా ఉంటుంది. కాలేజ్ ఎంటర్ టైనర్స్ ఎంజాయ్ చేసేవారు ఈ సినిమాని ఒకసారి చూడవచ్చు.