Anasuya: ‘పుష్ప’ లో అనసూయ లుక్.. అదరగొట్టిందిగా!

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా రూపొందుతోన్న ‘పుష్ప: ది రైజ్’ నుండీ ఈ మధ్య వరుసగా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు సునీల్ లుక్ ను విడుదల చేశారు. దానికి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పోషిస్తున్న స్టార్ యాంకర్ అనసూయ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ చిత్రంలో దాక్షాయణిగా కనిపించబోతుంది అనసూయ.

‘రంగస్థలం’ లో రంగమ్మత్త పాత్రతో ఓ కొత్త అనసూయని ప్రేక్షకులకు పరిచయం చేసి ప్రశంసలు అందుకున్న సుకుమార్.. ఇప్పుడు దానిని మరిపించేలా దాక్షాయనిగా పాత్రని డిజైన్ చేసినట్టు ఈ పోస్టర్ చూస్తే స్పష్టమవుతుంది. నోట్లో ఆకు నములుతూ.. చేతిలో అడకత్తెర పట్టుకుని పోకచెక్కలు పగల గొడతూ అనసూయ కనిపిస్తుంది. అనసూయని నటిగా మరో మెట్టు పైకి ఎక్కించే పాత్ర అవుతుందని స్పష్టమవుతుంది. ఇక సోషల్ మీడియాలో ఈ పోస్టర్ చూసిన అభిమానులు లైకులు వర్షం కురిపిస్తున్నారు.

‘పుష్ప’లో ఈమె సునీల్ కు భార్య పాత్రలో కనిపించబోతుందా అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఇక పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కాబోతుంది. ‘ముత్తంశెట్టి మీడియాతో’ క‌లిసి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌ళ‌యాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్టు కూడా నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus