Anil Ravipudi: అన్నీ చెప్పి అసలు విషయం దాస్తున్న అనిల్ రావిపూడి.. మొత్తం సెట్!
- January 23, 2026 / 12:52 PM ISTByFilmy Focus Desk
అనిల్ రావిపూడి ఇప్పటికే మూడు హ్యాట్రిక్‌లు కొట్టి ఇప్పుడు నాలుగో హ్యాట్రిక్‌కి సినిమాలు షురూ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఓ సినిమా వచ్చాక మరో సినిమా స్టార్ట్ చేయడానికి ఎక్కువ రోజులు తీసుకునే రకం కాదాయన. రెండు నెలల్లోనే కొత్త సినిమా పనులు స్టార్ట్ అవుతాయని ఆయన గత ట్రాక్ రికార్డు చూస్తే అర్థమవుతోంది. అయితే ప్రస్తుతం వస్తున్న పుకార్లు చూస్తుంటే ఆయన ఓ అగ్ర హీరోతోనే సినిమా స్టార్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు టాక్ వస్తున్న అగ్ర హీరోలు ఎవరూ ఖాళీగా లేరు. దీంతో అనిల్ తర్వాతి సినిమా ఏంటి అనేది అర్థం కావడం లేదు.
Anil Ravipudi
ఆయన కూడా చెప్పీ చెప్పనట్లుగా చెబుతున్నారు తప్ప.. అసలు విషయం ఎక్కడా క్లారిటీ ఇవ్వడం లేదు. మీ నెక్ట్స్ సినిమా ఎలా ఉండొచ్చు అని అడిగితే.. రెండు భారీ హిట్‌ల తర్వాత చేయబోయే సినిమా అంటే తికమక ఉంటుంది. అది చేయాలా? ఇది చేయాలా? అనే ఆలోచనలు ఎక్కువైపోతాయి. టీమ్‌కి పది రోజులు విరామమిచ్చాను. ఇటీవల వైజాగ్ టూర్‌లో ఒక ఆలోచన వచ్చింది. దాన్ని డెవలప్ చేస్తే ఈసారి సినిమా టైటిల్ ప్రకటన నుంచే విచిత్రమైన జర్నీ ప్రారంభం అవుతుంది అని చెప్పారు.
అంతేకాదు ఆ సినిమా టైటిల్ ప్రకటించాక ‘వామ్మో ఇదేంట్రా బాబూ’ అని కూడా అనుకుంటారు. కొంతమంది హమ్మయ్యా ఇంకో కాన్సెప్ట్‌తో వస్తున్నాడు అని అనుకోవచ్చు. అయితే కచ్చితంగా ఒక మాట చెప్పగలను. కచ్చితంగా ఈ సారి మేజిక్ జరగబోతోంది అని చెప్పారు. ఇదంతా వింటుంటే ఏదో ప్రయోగంలానే కనిపిస్తోంది. అయితే అది సేఫ్ సైడ్ ప్రయోగమే అవుతుంది. మరి ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్‌కి స్టార్ హీరోలు ఓకే చెబుదామన్నా ఎవరూ ఖాళీగా లేరు.
గతంలో టాక్ వచ్చిన నాగార్జున తన 100వ సినిమాతో బిజీ, వెంకటేశ్ ‘ఏకే 47’, ‘దృశ్యం 3’తో బిజీ. కాబట్టి ఎవరా హీరో? పోనీ ఆ మధ్యెప్పుడో పవన్ కల్యాణ్ అన్నారు కదా.. ఆయనేనా అంటే అనిల్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా మధ్యలో టాపిక్ వదిలేశారు. చూద్దాం మరి.















