కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్, తన బ్యాగ్రౌండ్ స్కోర్స్ తో సినిమాలకు కొత్త ఊపునిస్తుంటాడు. ‘జైలర్’, ‘లియో’, ‘జవాన్’ వంటి పెద్ద సినిమాలకు సంగీతం అందించి, ఈ చిత్రాలు భారీ విజయాలు సాధించడంలో అతని సంగీతం కీలక పాత్ర పోషించింది. ఈ విజయాలు అతని కెరీర్ లో నంబర్ వన్ పొజిషన్ ని మరింత పక్కగా స్థాపించాయి. అనిరుధ్ (Anirudh Ravichander) తన సినిమాల అవుట్ ఫుట్ చూసిన తర్వాత “బ్లాక్ మాస్టర్ బొమ్మ” అంటూ ట్వీట్ చేస్తే, ఆ సినిమా సక్సెస్ ఖాయం అనే అభిప్రాయం ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీలోనూ ఏర్పడింది.
ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’కి కూడా అనిరుధ్ తన సంగీతం అందించాడు. సినిమా మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ, అనిరుధ్ సంగీతం సినిమాకి పెద్దగా ప్లస్ అయింది. ఈ సినిమా ఇప్పటి వరకు 500 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించి, విజయవంతంగా థియేటర్లలో కొనసాగుతోంది. అయితే రజినీకాంత్ తాజా చిత్రం ‘వేట్టయన్’ విషయంలో అనిరుధ్ ప్రిడిక్షన్ తేడా కొట్టింది. మునుపటి సినిమాలతో పోలిస్తే ఈసారి అనిరుధ్ ఇచ్చిన ‘బ్లాక్ బస్టర్’ ఫీలింగ్ సరిగ్గా నిజం కాలేదు.
సినిమా విడుదలైన మొదటి రోజునే మిక్స్డ్ రివ్యూలు వచ్చిన ఈ చిత్రం వీకెండ్ పూర్తయ్యేసరికి బిలో యావరేజ్ గా నిలిచింది. సినిమా కలెక్షన్లు కూడా నిరాశ కలిగించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఈసారి అతని మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. దర్శకుడు జ్ఞాన్ వేల్ ఈ సినిమాలో రజినీకాంత్ ఇమేజ్ కు సరిపోయే మాస్ ఎలివేషన్స్ ఇవ్వకుండా, సోషల్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు.
అభిమానులు ‘జైలర్’ తరహా సక్సెస్ ని ఆశించినప్పటికీ, ఈ సినిమా ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయింది. దీంతో ఈసారి అనిరుధ్ చేసిన ప్రిడిక్షన్ తప్పిందనే అభిప్రాయం ఇప్పుడు పరిశ్రమలో వినిపిస్తోంది.