మెగాస్టార్ వారసుడిగా ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. నటనలో తండ్రిని మించిపోయాడు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కిచుకుని పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిపోయాడు. ఇక ఇదంతా పక్కన పెడితే 16 సంవత్సరాల క్రితం వజ్రోత్సవం వేడుకల్లో స్టేజ్ పై మాట్లాడుతూ చిరంజీవి చాలా ఎమోషనల్ అయ్యాడు. ‘గోవా ఫిలిం ఫెస్టివల్ లో ఏ ఒక్క తెలుగు నటుడి ఫోటో కూడా రాకపోవడం చాలా బాధగా అనిపించింది. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ వంటి ఎంతో మంది గొప్ప గొప్ప నటులు ఉన్నారు.
కానీ వారి ఫోటోలు కూడా గోవా ఫిలిం ఫెస్టివల్లో కనిపించడం లేదు. మన తెలుగుజాతికి గౌరవం లభించడం లేదు’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఏ ఈవెంట్ లో అయితే మన తెలుగు హీరోల బొమ్మలు లేవు అని చిరంజీవి బాదపడ్డాడో, అదే ఈవెంట్ లో నేడు ఆయన తనయుడికి సంబంధించిన కటౌట్ ని ఏర్పాటు చేసారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే గోవా లో మొన్న 54 వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ జరిగింది. ప్రతీ ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ఈవెంట్ లో వివిధ ఇండుస్త్రీలకు సంబంధించిన నటీనటుల ఫోటోలు మరియు కటౌట్స్ ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఒక నటుడికి అలాంటి గౌరవం దక్కడం చాలా అరుదు. ఆ అరుదైన సంఘటన రామ్ చరణ్ విషయం లో జరిగింది.
ఆర్.ఆర్.ఆర్ చిత్రం లోని అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉన్న (Ram Charan) రామ్ చరణ్ ఫోటో తో ఉన్నటువంటి కటౌట్ ని ఈ ఫిలిం ఫెస్టివల్ లో ఏర్పాటు చేసారు. కేవలం రామ్ చరణ్ కటౌట్ తప్ప మరో సౌత్ స్టార్ కి సంబంధించిన కటౌట్ లేకపోవడం విశేషం. హీరోయిన్స్ లో అనుష్క కి మాత్రమే ఆ అరుదైన అవకాశం లభించింది. మెగాస్టార్ చిరంజీవి కి ఇన్నేళ్ల కెరీర్ లో దక్కని అరుదైన గౌరవం రామ్ చరణ్ కి దక్కింది అంటూ అభిమానులు సోషల్ మీడియా లో మురిసిపోతున్నారు.