Mahesh Babu: సర్కారు వారి పాట నుంచి మరో సర్ ప్రైజ్.. ఎప్పుడంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు గీత గోవిందం దర్శకుడు పరశురామ్ కలయికలో వస్తున్న మొట్టమొదటి సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు మరింత ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల విడుదలైన మొదటి పాట కళావతి ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరొకసారి సంగీత దర్శకుడు థమన్ తన టాలెంట్ చూపించాడు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పాటలు మరిన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి అని అనిపిస్తుంది.

Click Here To Watch

సంగీత దర్శకుడు తమన్ ఇటీవల కాలంలో కంపోజ్ చేస్తున్న పాటలు యూట్యూబ్ లో సంచలనంగా మారుతున్నాయి. ముఖ్యంగా సాంగ్స్ పాత రికార్డులను కూడా బ్రేక్ చేస్తున్నాయి. కళావతి పాట టాలీవుడ్ ఇండస్ట్రీలో 24 గంటల్లో అత్యధికంగా వ్యూవ్స్ అందుకున్న. లిరికల్ పాటగా క్రేజ్ అందుకుంది. అయితే మరి మరో పాటను కూడా వీలైనంత త్వరగా విడుదల చేయాలని ఇటీవల దర్శకులతో మాట్లాడినట్లు సమాచారం. ఇక ఈసారి లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే నిర్మాణ సంస్థ కూడా ఆలోచిస్తోంది.

ఇక సర్కారు వారి పాట మార్చి 18వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే రెండవ పాటకు సంబంధించిన అన్ని రకాల పనులు పూర్తయ్యాయి. ఈ పాటను కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యలే చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తున్నారు. దీంతో సినిమా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. తప్పకుండా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అని అందరూ అనుకుంటున్నారు.

హీరోయిన్ గా మొదటిసారి కీర్తి సురేష్ మహేష్ బాబుతో కలిసి నటిస్తోంది. వీరికి సంబంధించిన సన్నివేశాలు కూడా సినిమాలో చాలా సరదాగా ఉంటాయని అంతేకాకుండా సినిమా క్లైమాక్స్ లో కూడా అందరికీ ఆలోచింపజేసేలా మంచి సందేశం ఉంటుందని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus