Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » ANR National Awards 2024: చిరంజీవికి ఏఎన్నార్‌ అవార్డు.. కార్యక్రమం హైలైట్స్‌ ఇవే.. స్టార్లు చెప్పిన విషయాలివే!

ANR National Awards 2024: చిరంజీవికి ఏఎన్నార్‌ అవార్డు.. కార్యక్రమం హైలైట్స్‌ ఇవే.. స్టార్లు చెప్పిన విషయాలివే!

  • October 29, 2024 / 03:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ANR National Awards 2024: చిరంజీవికి ఏఎన్నార్‌ అవార్డు.. కార్యక్రమం హైలైట్స్‌ ఇవే.. స్టార్లు చెప్పిన విషయాలివే!

ఏఎన్నార్‌ అవార్డు ప్రదానోత్సవంలో ఆసక్తికర ఘటనలు చాలా జరిగాయి. ఎవరికి ఎవరి మీద ఎంత గౌరవం ఉంది, ఎంత అభిమానం ఉంది అనేది కనిపించింది. ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు (Amitabh Bachchan)  ఎదురెళ్లి చిరంజీవి పాదాలకు నమస్కరించగా.. ఆయన అంతే ప్రేమగా దగ్గరకు తీసుకొని గౌరవం చూపించారు. ఏఎన్నార్‌  (Akkineni Nageswara Rao)  అవార్డును అమితాబ్‌ బచ్చన్‌ చేతుల మీదుగా అందుకున్నాక చిరంజీవి మాట్లాడుతూ అమితాబ్‌తో తన పరిచయం, అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. అంతకుముందు నాగార్జున (Nagarjuna) , అమితాబ్‌ మాట్లాడుతూ చిరంజీవి గురించి, ఏఎన్నార్‌ గురించి గొప్పగా చెప్పారు.

ANR National Awards 2024

ఏఎన్నార్ నేషనల్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి!

Megastar #Chiranjeevi #AmitabhBachchan #Nagarjuna #SubbaramiReddy #ANRNationalAward2024 pic.twitter.com/T5KKrXCF4Q

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మరో టాలీవుడ్ హీరో విడాకులు తీసుకోబోతున్నాడా?
  • 2 త్రివిక్రమ్ గురించి విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 11 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

— Filmy Focus (@FilmyFocus) October 28, 2024

ఏఎన్నార్‌ ప్రేమ అద్భుతం.. నాగ్‌ దేవుడిచ్చిన స్నేహం

* పద్మ భూషణ్‌ అవార్డు వచ్చినప్పుడు తనను సినిమా పరిశ్రమ సన్మానించిందని, ఆ సమయంలో అమితాబ్‌ తన గురించి ‘చిరంజీవి కింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా’ అని అనడంతో చిన్న వణుకు వచ్చిందని చిరంజీవి చెప్పారు. ఆ సమయంలో తన నోట మాట రాలేదన్నారు. అంతగా తన మనసు అమితానందంతో నిండిపోయిందని చెప్పారు.

చిరంజీవి గారు ‘కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా’: నాగార్జున#Nagarjuna #Chiranjeevi #ANRNationalAward2024 pic.twitter.com/LYUorOeqlZ

— Filmy Focus (@FilmyFocus) October 28, 2024

* హిందీలో తొలి సినిమా ‘ప్రతిబంధ్‌’ చేసినప్పుడు అమితాబ్‌కు చూపించారు చిరంజీవి. ఆయన సినిమా చూస్తున్నంతసేపూ ఆందోళనగా ఉన్నారట. సినిమా అయ్యాక బిగ్‌బీ వచ్చి ‘పవర్‌ ఫుల్‌ యాక్టింగ్‌ నీది, సమాజానికి అవసరమైన సినిమా చేశావ్‌’ అని మెచ్చుకున్నారట.

* ‘‘సైరా’లో నా గురువు పాత్ర కోసం అమితాబ్‌ బచ్చన్‌ కాంటాక్ట్‌ అయితే ఆయన వెంటనే ఒప్పుకున్నారని చెప్పిన చిరు.. షూటింగ్‌ తర్వాత ‘ఫార్మాలిటీస్‌’ గురించి మొహమాటపడుతూ అడిగితే.. నీ మీద ప్రేమతో ఈ సినిమా చేస్తున్నాను. ఫార్మాలిటీస్‌ అని నన్ను ఇన్‌సల్ట్‌ చేయొద్దు అని అన్నారు అని చిరంజీవి చెప్పారు.

‘కల్కి’ చూశాక .. ‘ఒరిజినల్ మాస్ హీరో ఈజ్ బ్యాక్’ అని అమితాబ్ జీకి చెప్పాను: అక్కినేని నాగార్జున#Nagarjuna #AmitabhBachchan #Chiranjeevi #ANRNationalAward2024 #Kalki2898AD pic.twitter.com/1vWbo2yzw7

— Filmy Focus (@FilmyFocus) October 28, 2024

* ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఓ నానుడి ఉంది. నా విషయంలో అయితే తొలుత రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలిచాను. టాలీవుడ్‌ వజ్రోత్సవాల సమయంలో లెజండరీ పురస్కారం ప్రదానం చేయబోయారు. కానీ ఆ రోజు కొందరు హర్షించక ఆ పురస్కారాన్ని తీసుకోవడం సముచితం అనిపించలేదు. అందుకే ఆ అవార్డుని ఓ క్యాప్సుల్‌ బాక్స్‌లో పడేశాను అని నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు చిరు.

నా సినిమాలు బాగున్నా మా నాన్న పొగిడేవారు కాదు: చిరంజీవి#Chiranjeevi #ANRNationalAward2024 pic.twitter.com/a72FXcTUJa

— Filmy Focus (@FilmyFocus) October 28, 2024

* ఈ రోజు ఏఎన్నార్‌ అవార్డును అందుకుంటూ ‘నేను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను’ అని అంటున్నాను. నాకు పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌ వరించినా గిన్నిస్‌ బుక్‌లో స్థానం దక్కినా.. ఈ అవార్డు విషయంలో చాలా ఆనందంగా ఉన్నాను అని చిరు తెలిపారు.

* ఏఎన్నార్‌ అభిమానుల్లో సీనియర్‌ మోస్ట్‌ ఫ్యాన్‌ మా అమ్మే. ఆమె కడుపులో నేను ఉన్నప్పుడు నాన్నను బతిమలాడి నాగేశ్వరరావు సినిమా ‘రోజులు మారాయి’కి వెళ్లింది. మధ్యలో చిన్నపాటి సమస్య వచ్చి జట్కా బండి తిరగబడినా ఆమె వెరవలేదు. సినిమా చూడాల్సింది అని పట్టుబట్టి చూసింది అని నాటి రోజుల్ని చెప్పారు చిరు.

మా అమ్మ కడుపుతో ఉండి కూడా మొగల్తూరు నుండి పాలకొల్లు వరకు జట్కాబండిలో వెళ్లి నాగేశ్వరరావుగారి సినిమా చూసింది: చిరంజీవి#Chiranjeevi #ANRNationalAward2024 pic.twitter.com/S4bh2xBrZC

— Filmy Focus (@FilmyFocus) October 28, 2024

* నాగేశ్వరరావు అంటే అమ్మకున్న అభిమానం.. రక్తం ద్వారా నాకు వచ్చిందేమో. ఆయన డ్యాన్స్‌లంటే నాకు ఇష్టం. ఆయన సినిమాల్లో పాటలకు ఇంట్లో డ్యాన్స్‌లు వేసేవాణ్ని. ఓసారి అక్కినేని నా గురించి మాట్లాడుతూ ‘నాకు ఎముకలు ఉన్నాయి, కానీ చిరంజీవికి ఎముకలు లేవు’ అని అన్నారు. అంతగా నన్ను అభిమానించారు అని తెలిపారు.

ఏఎన్నార్ నేషనల్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి!

Megastar #Chiranjeevi #AmitabhBachchan #Nagarjuna #SubbaramiReddy #ANRNationalAward2024 pic.twitter.com/T5KKrXCF4Q

— Filmy Focus (@FilmyFocus) October 28, 2024

* ‘కాలేజీ బుల్లోడు’ వంద రోజుల ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు.. నన్ను లేచి నిలబడి ప్రేక్షకుల్ని పలకరించి వారి అభిమానాన్ని ఆస్వాదించమన్నారు. ఓ పెద్ద హీరో నా లాంటి కుర్ర హీరోకు అభిమానాన్ని షేర్‌ చేయడం అంటే పెద్ద విషయం అంటూ అక్కినేని గొప్పతనం గురించి చెప్పారు చిరు.

* నాగార్జున నాకు ఆరోగ్య సూత్రాలు తెలిపే డాక్టర్‌. నేను ఇప్పటికీ యంగ్‌గా, సరదాగా ఉన్నానంటే నాగార్జున కూడా ఓ కారణం. ఈ విషయంలో నాగ్‌ని కూడా గుడ్డిగా ఫాలో అవుతా. అక్కినేని కుటుంబం మా కుటుంబ సభ్యుల్లాంటివారే. నాగ్‌ లాంటి స్నేహితుణ్ని నా మనసులో పదిలం చేసుకుంటాను అని చిరంజీవి అన్నారు.

చిరును చూసి గ్రేస్‌ నేర్చుకోమన్నారు

* చిరంజీవి హిట్లు, సూపర్‌హిట్లు, రికార్డుల గురించి అందరికీ తెలిసిందే. ఇటీవలే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో కూడా చోటు సంపాదించారు అని చెప్పిన నాగ్‌.. ఆయన సినిమాల్లోకి రాకముందు చిరు గురించి తండ్రి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు.

* అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిరంజీవి ఓ పాట చిత్రీకరణలో ఉండగా.. అక్కినేని.. నాగార్జునను పిలిచి.. ‘చిరంజీవి అక్కడ డ్యాన్స్‌ చేస్తున్నాడు. సినిమాల్లోకి వద్దామనుకుంటున్నావ్‌ కదా వెళ్లి చూడు. నేర్చుకోవచ్చు’ అని చెప్పారట. అలా చూసిన తనకు చిరు డ్యాన్స్‌లో గ్రేస్‌ చూసి భయం పట్టుకుందని చెపపారు. ఆయనలాగా డ్యాన్స్‌ చేయగలుతామా అని అనిపించిందని చెప్పారు.

చిరంజీవిని చూసి డాన్స్ నేర్చుకో అని నాన్నగారు అన్నారు: నాగార్జున#Nagarjuna #Chiranjeevi #AmitabhBachchan #ANRNationalAward2024 pic.twitter.com/r7eo1x6qLK

— Filmy Focus (@FilmyFocus) October 28, 2024

* అమితాబ్‌ బచ్చన్‌కు గతంలో ఈ అవార్డు ఇచ్చినప్పుడు అనుకున్న ప్రొటోకాల్‌ ప్రకారం చిరంజీవిని స్టేజీ పైకి ఆహ్వానించలేమని చెప్పాను. దానికి ఆయన ‘అందులో అభ్యంతరం ఏముంది వస్తా. ముందు కూర్చొని వేడుక చూస్తా’ అని అన్నారు అని నాగార్జున తెలిపారు.

* చిరంజీవి, అమితాబ్‌ భారతీయ సినిమాకు ఎనలేని కృషి చేశారు. అందుకే వారిద్దరు ‘ఏబీసీ’ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా అని పొగిడేశారు నాగ్‌. ‘కల్కి 2898 ఏడీ’  (Kalki 2898 AD) సినిమాలోని బిగ్‌బీని చూసి.. నా ఒరిజినల్‌ మాస్ హీరో ఈజ్‌ బ్యాక్‌ అని అనుకున్నానని నాగ్‌ చెప్పారు.

నేనూ టాలీవుడ్‌ సభ్యుడినే..

* నా కుమారులు అయినంత మాత్రాన మీరు నా వారసులు కాలేరు. నా వారసులైనవారే, నా కుమారులవుతారు అని మా నాన్న చెప్పేవారు అని అమితాబ్‌ తన తండ్రి హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌ రాసిన కవితను గుర్తు చేసుకున్నారు. ఏఎన్నార్‌ విషయంలో నాగార్జున, ఆయన కుటుంబం ఆ మాటను చేసి చూపించింది అని బిగ్‌బీ అన్నారు.

‘కల్కి’ వల్ల నేను కూడా తెలుగు సినీపరిశ్రమకి చెందిన వాడినే అని గర్వంగా చెప్పుకుంటున్నా: అమితాబ్ బచ్చన్#AmitabhBachchan #Nagarjuna #Chiranjeevi #ANRNationalAward2024 #Kalki2898AD pic.twitter.com/edqZpFuQYf

— Filmy Focus (@FilmyFocus) October 28, 2024

* ఈ క్రమంలో లంచ్‌ కోసం చిరంజీవి కోసం చిరంజీవి పంపిన ఫుడ్‌ గురించి సరదాగా మాట్లాడారు. లంచ్‌ కోసం ఫుడ్‌ పంపిస్తారు అంటే నా హోటల్‌ రూమ్‌ నిండా ఆ భోజనం పట్టేసింది. ఓ పెద్ద బాస్కెట్‌ నిండా ఫుడ్‌ పంపించారు. మీకు హాస్పిటాలిటీకి, మీ ప్రేమకు నా ధన్యవాదాలు అని అమితాబ్‌ చెప్పారు.

* తమ సినిమాల్లో భాగం చేసి నన్ను తెలుగు సినిమా పరిశ్రమ మనిషిని చేసినందుకు చిరంజీవి, నాగార్జున, నాగ్‌ అశ్విన్‌కు (Nag Ashwin)  ధన్యవాదాలు. టాలీవుడ్‌లో నేనూ సభ్యుడినే అని గర్వంగా చెప్పుకుంటాను. అలాగే రాబోయే సినిమాల్లో నాకు అవకాశం ఇవ్వడం మరవొద్దు అని నవ్వేశారు అమితాబ్‌.

మణిరత్నం మెచ్చుకున్న నటిపై ఏమిటీ పిచ్చి ట్రెండ్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nageswara Rao
  • #ANR
  • #Chiranjeevi
  • #nagarjuna

Also Read

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

related news

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Vishwambhara: ‘విశ్వంభర’లో ఐటెమ్‌ సాంగ్‌ రీమిక్స్‌.. వశిష్టా సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారా?

Kuberaa Collections: ‘కుబేర’.. సైలెంట్ గా రూ.120 కోట్లు కొట్టేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. సైలెంట్ గా రూ.120 కోట్లు కొట్టేలా ఉందిగా..!

Vishwambhara: ‘ఓజి’ ‘అఖండ 2’ తో పోటీగా ‘విశ్వంభర’ వస్తుందా?

Vishwambhara: ‘ఓజి’ ‘అఖండ 2’ తో పోటీగా ‘విశ్వంభర’ వస్తుందా?

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

trending news

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

2 hours ago
3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 hours ago
Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

5 hours ago
Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

5 hours ago
Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

6 hours ago

latest news

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

2 hours ago
రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

3 hours ago
Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

3 hours ago
Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

4 hours ago
Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version